ETV Bharat / city

HC: అంబటి రాంబాబుపై అక్రమ మైనింగ్ వ్యాజ్యంలో హైకోర్టు కీలక వ్యాఖ్య.. - హైకోర్టు వార్తలు

సత్తెనపల్లి వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో పాటు పలువురిపై నమోదైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఎమ్మెల్యే అంబటి అక్రమమైనింగ్ పిల్​పై హైకోర్టు

author img

By

Published : Sep 28, 2021, 3:05 AM IST

Updated : Sep 28, 2021, 3:31 AM IST

వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు, మరో ఎనిమిది మంది గనుల అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారంటూ దాఖలైన పిల్‌ను విచారించిన హైకోర్టు.. ఇందులో ఏదో తప్పు జరుగుతోందని వ్యాఖ్యానించింది. పిటిషనర్ ఆరోపిస్తున్నవారికి కాకుండా వేరేవారికి నోటీసులు జారీ చేయడంపై సందేహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలుకు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. గుంటూరు జిల్లా కోటనెమలిపురి, కుబాదుపురం రెవన్యూ గ్రామల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో.. అంబటి, ఆయన మనుషులు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని.. ఇద్దరు వైకాపా కార్యకర్తలు గతేడాది హైకోర్టులో పిల్ వేశారు.

అక్రమ మైనింగ్ జరగలేదన్న ప్రభుత్వ తరఫు న్యాయవాది.. ప్రైవేటు వ్యక్తులకు చెందిన పట్టా భూముల్లో అనుమతుల్లేకుండా తవ్వకాలకు పాల్పడుతున్నవారికి పెనాల్టీ చెల్లించాలని నోటీసులు పంపించామన్నారు. తాము అక్రమ మైనింగ్‌కు పాల్పడలేదని నిరూపించుకునే అవకాశమివ్వాలని నోటీసులు అందుకున్నవారు కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

TDP DECISIONS: రైతులు, నిరాశ్రయులను ప్రభుత్వం ఆదుకోవాలి: తెదేపా

Last Updated : Sep 28, 2021, 3:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.