ETV Bharat / city

'జస్టిస్‌ జేకే మహేశ్వరి బదిలీ ఆపండి' - మూడు రాజధానులు వార్తలు

3 రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై తీర్పు వచ్చేవరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.కె.మహేశ్వరి బదిలి ఆపేయాలని కోరుతూ...రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య విజ్ఞప్తి చేసింది.

cj maheswari
జస్టిస్ జె.కె.మహేశ్వరి
author img

By

Published : Dec 19, 2020, 8:29 AM IST

మూడు రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దు చట్టాల్ని సవాల్‌ చేస్తూ రాజధాని రైతులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ హైకోర్టులో కీలకదశలో ఉన్నందున, అది కొలిక్కివచ్చి.. తీర్పు వెలువడే వరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జె.కె.మహేశ్వరి బదిలీని నిలిపివేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య విజ్ఞప్తి చేసింది. సంస్థ అధ్యక్షుడు మాదల శ్రీనివాసు ఈ మేరకు శుక్రవారం రాష్ట్రపతికి లేఖ రాశారు. ఆ వ్యాజ్యాల్ని జస్టిస్‌ జె.కె.మహేశ్వరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యలతో కూడిన హైకోర్టు ఫుల్‌బెంచ్‌ విచారిస్తున్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.

'తుది విచారణలో భాగంగా హైకోర్టు ఫుల్‌ బెంచ్‌ ఇప్పటికే రైతుల తరపున వాదనలు వినడం పూర్తయింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించే ప్రక్రియ కూడా ముగింపు దశకు వచ్చింది. ఈ దశలో కొత్త ప్రధాన న్యాయమూర్తి వస్తే వాదనలన్నీ కోర్టు మళ్లీ మొదటి నుంచీ వినడానికి చాలా సమయం పడుతుంది. ఆ రెండు చట్టాలపై దాఖలైన వ్యాజ్యాలను త్వరితగతిన విచారించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విఘాతం కలుగుతుంది. ఆ కేసుల్లో సీనియర్‌ న్యాయవాదుల్ని నియమించుకునేందుకు రైతులు తమ కష్టార్జితాన్ని చందాలుగా వేసుకుని ఖర్చు పెట్టారు. మరోసారి విచారణ అంటే.. ఆ ఖర్చులను వారు భరించలేరు. ఆ రెండు చట్టాలకు సంబంధించిన వ్యాజ్యాల్లో కోర్టు ఇవ్వబోయే తీర్పు రాజధానికి భూములిచ్చిన వేల మంది రైతుల జీవనోపాధినే కాకుండా, రాష్ట్ర ఆర్థిక, భౌగోళిక చరిత్రపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయవ్యవస్థపై సామాన్యులకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేందుకు మీరు చొరవ తీసుకుని హైకోర్టు ఫుల్‌బెంచ్‌ తీర్పు వెలువరించే వరకు జస్టిస్‌ జె.కె.మహేశ్వరి బదిలీని నిలుపుదల చేయాలని వినమ్రంగా విన్నవిస్తున్నాం' అని లేఖలో శ్రీనివాసు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ప్రతిదీ వినడానికే ఉన్నాం: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.