టాలీవుడ్ డ్రగ్స్ కేసు(Tollywood drugs case)లో ఈడీ (enforcement directorate) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. నోటీసులు జారీ చేసిన ఒక్కొక్కరూ విచారణకు హాజరు హాజరుకావడంతో పాటు.. ఎక్సైజ్ కేసు(excise case)లో ప్రధాన నిందితుడుగా ఉన్న కెల్విన్(KELVIN)ను కలిపి విచారిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కెల్విన్ వద్ద సేకరించిన వివరాలతో ఒక్కొక్కరిని సుధీర్ఘంగా విచారిస్తున్నారు. ఇప్పటికే పలువురిని విచారించిన ఈడీ అధికారులు.. ఇవాళ నటుడు రవితేజ(HERO RAVI TEJA)తో పాటు అతడి డ్రైవర్ శ్రీనివాస్‌ను ఈడీ అధికారులు విచారించారు.
డ్రగ్స్ కేసు, మనీలాండరింగ్ వ్యవహారంపై రవితేజను దాదాపు 6 గంటలపాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. రవితేజ డ్రైవర్ శ్రీనివాస్‌ను కూడా అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో రవితేజ డ్రైవర్‌పై తీవ్ర ఆరోపణలు రావడం వల్ల.. ప్రస్తుతం ఈడీ కూడా ప్రత్యేక దృష్టి పెట్టి విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపింది. కెల్విన్ నుంచి డ్రైవర్ శ్రీనివాస్‌కు మాదకద్రవ్యాలు సరఫరా అయ్యాయని ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఈడీ అధికారులు.. డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జరిగాయనే దానిపై లోతుగా విచారించినట్టు సమాచారం.
ఇదీ చూడండి:
Tollywood Drugs case : ఈడీ కార్యాలయంలో కెల్విన్.. 4 గంటలుగా నందు విచారణ