telangana weather report: తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో నేడు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదే విధంగా రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపింది.
తూర్పు పశ్చిమ ద్రోణి మధ్యప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా.. సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వివరించింది. అంతర్గత ఒడిశా, దాని పరిసరాల్లోని ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ ఒడిశా, దాని పరిసరాలలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉందని తెలిపింది.
ఇవీ చూడండి: