ETV Bharat / city

భారీ వర్షాలు.. వరద ఉద్ధృతికి బైక్‌తో సహా ఓ వ్యక్తి కొట్టుకుపోతుండగా..! - నేటి వాతావరణ సూచిక

Heavy Rains in Nagarkurnool: తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాలతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. బైక్​ల దగ్గర్నుంచి భారీ వాహనాలు సైతం పొంగుతున్న వాగులు వంకలకు ఎదురీదలేక.. వాగుల్లో కొట్టుకుపోతున్నాయి. అలాంటి ఘటన తెలంగాణ నాగర్‌ కర్నూల్ జిల్లాలో వరద ఉద్ధృతికి ద్విచక్ర వాహనంతో ఓ వ్యక్తి కొట్టుకుపోతుండగా.. స్థానికులు కాపాడారు.

RAIN_EFECT
RAIN_EFECT
author img

By

Published : Oct 13, 2022, 7:47 PM IST

వరద ఉద్ధృతికి బైక్‌తో సహా కొట్టుకుపోయిన వ్యక్తి

Heavy Rains in Nagarkurnool: రెండు రోజులుగా నాగర్‌ కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని చెరువులు, కుంటలు వాగులు మత్తడి పోతున్నాయి. పలు కాలనీల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల ప్రభావంతో జిల్లాలోని తాడూరు దుందుభి వాగు, నల్లవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దుందుభివాగు శివారులోని.. గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రవాహ ఉధృతికి గుట్టలపల్లి-పోల్మురు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దుందుభివాగు ప్రవాహ ఉద్ధృతికి ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఒకరు కొట్టుకుపోతుండగా అక్కడ ఉన్న వారు రక్షించారు. అలాగే తాడు సహాయంతో ద్విచక్రవాహనాన్ని స్థానికులు బయటకు లాగారు. ఆ యువకుడిని కాపాడారు. దుందుభి వాగు ప్రవాహానికి తాడూరు మండలం నాగుదేవుపల్లిలో వైకుంఠధామం నిర్మాణాలు కుప్పకూలాయి. బిజినేపల్లి మండలం నల్లవాగు ఉద్ధృతికి వైకుంఠధామం నీట మునిగింది.

రాగల మూడు రోజులు భారీ వర్షాలు.. రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్నసిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌, హన్మకొండ, సిద్ధిపేట, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామరెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

రేపు మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్‌, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి.. ఎల్లుండి వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదవుతాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.