ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని వాతవారణశాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణాతో పాటు గుంటురూ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రకాశం, కడప కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనావేసింది.
పిడుగుపాటు హెచ్చరిక
విజయనగరం, విశాఖ జిల్లాలకు వాతవరణశాఖ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాలోని పలు మండలాల్లో పిడుగులుపడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇదీ చదవండి
'వరదలు వస్తే సీఎం విదేశాల్లో ఉన్నారు... మనం జనంలో ఉన్నాం...'