వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. బుధ, గురువారాల్లో గోదావరి జిల్లాల వ్యాప్తంగా అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతంతో పాటు లంక గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ హెచ్చరించారు.
తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం ఉందని... మత్య్సకారులు ఎట్టి పరిస్థితుల్లో సముద్రంలోకి వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇదీ చదవండి:
ఇళ్ల పట్టాలు ఇచ్చి ముంచేస్తారా? ఎంత మొత్తుకున్నా చెప్పినా వినరా?