ETV Bharat / city

తెలంగాణపై కుంభవృష్టి.. నేడు, రేపు అత్యంత భారీ వర్షాలు - భారీ వర్షాలు

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు కూడా భారీగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎడతెరిపిలేని వర్షానికి గోడ కూలి మీద పడడంతో నల్గొండలో తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు.

rains in telanagana
తెలంగాణపై కుంభవృష్టి.. నేడు, రేపు అత్యంత భారీ వర్షాలు
author img

By

Published : Jul 9, 2022, 10:48 AM IST

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కుంభవృష్టి కురుస్తోంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకూ భారీ వర్షం కొనసాగింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో 19.4 సెంటీమీటర్ల(సెం.మీ.) వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 10 గంటల వరకు సూర్యాపేట జిల్లా మునగాలలో 9.75 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పలు జిల్లాల్లో వాగులూ వంకలూ పొంగి ప్రవహిస్తున్నాయి. నల్గొండలో గోడ కూలి తల్లీకుమార్తె చనిపోయారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆర్‌యూబీ కింద వర్షపు నీటిలో పాఠశాల బస్సు చిక్కుకుంది. సమీపంలోని రైతులు, యువకులు 25 మంది విద్యార్థులను రక్షించారు. గజ్వేల్‌ మండలంలో పాఠశాల ఆవరణలో విద్యుత్‌ స్తంభం కూలింది. విద్యార్థులెవ్వరికీ ఏమీ కాకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.

మరోవైపు శనివారం అత్యంత భారీగా, ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో రుతుపవనాలు వేగంగా కదులుతూ అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర అధికారి శ్రావణి వివరించారు. రాష్ట్రంలో విద్యుత్‌ గరిష్ఠ డిమాండు శుక్రవారం ఉదయం 8 గంటలకు 8356 మెగావాట్లుంటే రాత్రి 8.30 గంటలకు 6 వేల మెగావాట్లకు పడిపోయింది. సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, దుమ్ముగూడెం మండలాల్లో వాగుల్లో శంకర్‌(28), ఏనిక దుర్గమ్మ(55)లు గల్లంతయ్యారు. బూర్గంపాడు మండలంలో పశువుల కాపరి నర్సిరెడ్డి కిన్నెరసాని వాగులో చిక్కుకుపోగా రెస్క్యూ టీం బయటకు తీసుకొచ్చింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు 20.6 అడుగులకు పెరిగింది. దుమ్ముగూడెం మండలం పర్ణశాల సీతవాగు పొంగి సీతమ్మ నారచీరల ప్రాంతం, సీతమ్మ విగ్రహం, స్వామివారి ఉత్తరీయం తెలిపే ఆనవాళ్లు నీట మునిగాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

.
.

బడిలో కూలిన విద్యుత్తు స్తంభం
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం గిరిపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం విద్యుత్తు స్తంభం కూలిపోయింది. విద్యార్థులు పాఠశాల వరండాలో మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో గాలివానకు ఆవరణలోని చెట్టు పడిపోయింది. పక్కనే ఉన్న విద్యుత్తు తీగలపై పడటంతో స్తంభం బడి భవనంపై కూలింది. ఉపాధ్యాయులు అప్రమత్తమై భోంచేస్తున్న విద్యార్థులను పక్కకు పంపేయడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ బడిలో ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు 100 మందికి పైగా విద్యార్థులున్నారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లోని పురాతనమైన జూనియర్‌ సివిల్‌ కోర్టు ప్రధాన హాలు గోడ గురువారం అర్ధరాత్రి కుప్పకూలింది. పగటిపూట కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు.

.

25 మంది విద్యార్థులను కాపాడిన రైతులు
మహబూబ్‌నగర్‌ జిల్లాలో పాఠశాల విద్యార్థులకు పెనుప్రమాదం తప్పింది. వారు వెళుతున్న బస్సు వర్షపు నీటిలో ఆగిపోయింది. బస్సులోకి నీరు చేరింది. సమీపంలోని రైతులు, యువకులు నీటిలో ఈదుకుంటూ వెళ్లి విద్యార్థులను రక్షించారు. ఈ ఘటన రామచంద్రాపూర్‌ పంచాయతీ పరిధి సూగుండ తండా ఆర్‌యూబీ(రైల్వే అండర్‌ బ్రిడ్జి) వద్ద శుక్రవారం జరిగింది. మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు రోజూ మాదిరిగా విద్యార్థులను ఎక్కించుకొని ఉదయం 8.30 ప్రాంతంలో వర్షంలో బయలుదేరింది. మార్గమధ్యంలోని సూగుర్‌గడ్డ తండా ఆర్‌యూబీ కింద భారీగా నీరు నిలిచింది. వేగం పెంచితే వెళ్లవచ్చని డ్రైవర్‌ బస్సును ముందుకు నడిపాడు. మధ]్యలోకి వెళ్లగానే సైలెన్సర్‌, ఇంజిన్‌లోకి నీరు చేరి వాహనం ఆగిపోయింది. క్షణాల్లో బస్సులోకి నీరు చేరడంతో డ్రైవర్‌ అయోమయానికి గురయ్యాడు. విద్యార్థులు భయంతో కేకలు వేయడంతో సమీప సూగుండతండా రైతులు, యువకులు అందులోని 25 మంది విద్యార్థులను కాపాడారు. ప్రమాదంపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆరాతీశారు. రైల్వేశాఖ నిర్లక్ష్యం వల్లనే అండర్‌ బ్రిడ్జి వద్ద తరచూ వర్షపునీరు నిలుస్తోందని, చిన్నారుల ప్రాణాలు పోయి ఉంటే పరిస్థితేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

.
.

గోడ కూలి తల్లి, కుమార్తె మృతి
ఎడతెరిపిలేని వర్షం కారణంగా గోడ మీద పడడంతో ఆషాఢ మాసమని పుట్టింటికి వచ్చిన నవవధువు, ఆమె తల్లి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఏపీలోని శ్రీకాకుళం జిల్ల్లా మాకివలసకు చెందిన నడిపూరి లక్ష్మి(47), నాయుడు దంపతులకు కుమారుడు భాస్కరరావు, కుమార్తె కల్యాణి(21) సంతానం. గతంలో నాయుడు అనారోగ్యంతో మృతి చెందారు. బతుకుతెరువు కోసం లక్ష్మి.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రైల్వే కూలీలతో కలిసి రెండేళ్ల కిందట నల్గొండకు వచ్చారు. ఇక్కడి పద్మానగర్‌ కాలనీలో ఉంటూ లక్ష్మి రైల్వే కూలీలకు భోజనం వండి పెడుతుండేవారు. రెండు రోజుల కిందట కుమారుడు భాస్కరరావు సొంత ఊరు వెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో గోడకూలి నిద్రిస్తున్న తల్లి, కుమార్తెపై పడటంతో వారిద్దరూ ఊపిరాడక మృతి చెందారు. లక్ష్మి ఈ ఏడాది మే 14న కుమార్తె కల్యాణిని శ్రీకాకుళం జిల్లా పర్లాం గ్రామానికి చెందిన పెయింటర్‌ శ్రీనివాస్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఆషాఢమాసం కావడంతో మూడు రోజుల కిందట కల్యాణి నల్గొండలో తల్లి వద్దకు వచ్చింది. అంతలోనే ఈ ప్రమాదం సంభవించింది.

.

షేక్‌పేటలో ద్విచక్ర వాహనదారుడి దుర్మరణం
ఈనాడు- హైదరాబాద్‌, రాయదుర్గం- న్యూస్‌టుడే: కుండపోత వానతో భాగ్యనగరం వణికింది. సాయంత్రం వరకు చిరు జల్లులతో సరిపెట్టిన వరుణుడు.. రాత్రి 8 గంటల నుంచి విరుచుకుపడ్డాడు. రాయదుర్గం షేక్‌పేట పైవంతెనపై శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న పల్లపు శ్రీను(29) అదుపు తప్పి కింద పడి చనిపోయారు. హబ్సిగూడ, రామంతాపూర్‌లో ప్రధాన రహదారులు, అంతర్గత కాలనీలు నీట మునిగాయి. ఉప్పల్‌-నారపల్లి మార్గం బురదమయం కావడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. నాగోల్‌, బైరామల్‌గూడ, సంతోష్‌నగర్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, కొత్తగూడ, జూపార్కు నుంచి ఆరాంఘర్‌ చౌరస్తా వెళ్లే రోడ్డు మార్గాల్లో పైవంతెన వద్ద నీరు నిలిచి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మెహిదీపట్నం-అత్తాపూర్‌ల మధ్య ట్రాఫిక్‌ స్తంభించింది. ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, మూసాపేట రహదారిపై వరద నిలిచింది. బోడుప్పల్‌, పీర్జాదిగూడ ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

ఇదీ చూడండి: Doli : డోలీ దాటని గిరిజనం బతుకులు.. గర్భిణి అవస్థలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.