రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం గరిష్ఠంగా కృష్ణా జిల్లా గన్నవరం, ఉంగుటూరులో 47.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరుతోపాటు పలు జిల్లాల్లోని 101 మండలాల్లో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంది.
537 మండలాల్లో ఉష్ణతాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇవాళ, రేపు ఎండలు, వడగాలులు కొనసాగనున్నాయి. మరోవైపు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని సూచించింది.
ఇదీ చదవండి: