జగన్ అక్రమాస్తుల కేసుల్లో మొదట ఈడీ కేసులు విచారణ జరపాలా లేక సీబీఐ కేసులా అనే అంశంపై న్యాయస్థానం జనవరి 11న నిర్ణయం వెల్లడించనుంది. జగన్ అక్రమాస్తులపై సీబీఐ 11, ఈడీ 6 అభియోగ పత్రాలను దాఖలు చేసింది. అయితే సీబీఐ ఛార్జ్ షీట్లతో సంబంధం లేకుండా తమ అభియోగ పత్రాలపై విచారణ ప్రారంభించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరింది. సీబీఐ కేసుల ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేసింది కాబట్టి.. ముందుగా సీబీఐ కేసులపై విచారణ జరపాలని.. లేదా రెండూ సమాంతరంగా జరపాలని జగన్, విజయ్ సాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి తదితరులు వాదించారు. అందరి వాదనలు విన్న సీబీఐ, ఈడీ కోర్టు తీర్పును.... జనవరి 11కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి