ETV Bharat / city

'ఈ కేసు విచారణ ఆ బెంచ్​లోనే ఉంటే బాగుంటుంది'

న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ప్రతివాదులకు ప్రధాన న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. కేసును చీఫ్ జస్టిస్ బెంచ్‌కు బదలాయిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

Hearings in high court over phone tapping Issue
'ఈ కేసు విచారణ ఆ బెంచ్​లోనే ఉంటే బాగుటుంది'
author img

By

Published : Sep 2, 2020, 2:59 PM IST

Updated : Sep 2, 2020, 4:16 PM IST

కొంతమంది న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయని, వాటిపై సీబీఐ దర్యాప్తు కోరుతూ విశాఖ న్యాయవాది నిమ్మిగ్రేస్ వేసిన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే ఈ వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ పిటిషనర్ వాదనలు విని సంతృప్తి చెందింది. పలు కంపెనీల నెట్​వర్క్ ప్రొవైడర్స్​కు, సీబీఐ, సీవిసీలకు నోటీసులు జారీ చేశారని పిటిషనర్ న్యాయవాది శ్రవణ్​కుమార్.. జస్టిస్ రాకేష్​కుమార్ బెంచ్​కు వివరించారు.

ప్రధాన న్యాయమూర్తి బెంచ్ వాదనలు విని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినందునా... ఈ కేసు విచారణ ఆ బెంచ్​లోనే ఉంటే బాగుటుందని జస్టిస్ రాకేష్​కుమార్, జస్టిస్ ఉమాదేవి బెంచ్​ అభిప్రాయపడిందని పిటిషనర్ న్యాయవాది శ్రవణ్ తెలిపారు. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి బెంచ్​కు బదిలీ చేస్తూ ఆదేశాలు చేశారు. ఫోన్లు ట్యాపింగ్ చేసేందుకు, న్యాయమూర్తుల కదలికలను తెలుసుకునేందుకు ఇద్దరు ఐపీఎస్ అధికారులు, 40 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నారని పిటిషనర్​ పేర్కొన్నట్లు న్యాయవాది శ్రవణ్ తెలిపారు.

ఇదీ చదవండీ... ఏపీలో 54.96 శాతం పెరిగిన రైతులు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు

Last Updated : Sep 2, 2020, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.