ఆర్టీసీ ఉద్యోగులకు (ప్రజా రవాణాశాఖ) ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్‌ఎస్) వర్తింపజేస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆర్టీసీ డిస్పెన్సరీలు, సెంట్రల్ ఆసుపత్రిలో కాకుండా ఆరోగ్య ట్రస్టు అనుబంధ ఆసుపత్రుల్లో చికిత్స కోసం వచ్చే ఉద్యోగులు, వారి కుటుంబీకులకు ఈ అవకాశాన్ని కల్పిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ ఉత్తర్వులనిచ్చారు. భవిష్యత్తులో ఉద్యోగ విరమణ చేసే వారికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని పేర్కొన్నారు.
ఆరోగ్య పథకాన్ని వర్తింపజేసేందుకు వీలుగా ఉద్యోగుల నుంచి నిర్దేశించిన (ఈపీఎఫ్ తరహా) మొత్తాన్ని ప్రతినెలా ప్రభుత్వ ఖజానాకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆరోగ్య కార్డుల పంపిణీతోపాటు ఇతర చర్యలను వెంటనే తీసుకోవాలని ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా ఎన్‌ఎంయూఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, శ్రీనివాసరావు ఓ ప్రకటనలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
పాత విధానంలోనే వైద్యం అందించాలి..
ఆర్టీసీ ఉద్యోగులను ఈహెచ్‌ఎస్ పరిధిలోకి తీసుకురావడం సరికాదని ఏపీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ వర్కర్స్ సమాఖ్య అధ్యక్షుడు జిలానీబాషా, ప్రధాన కార్యదర్శి సుందరరావు పేర్కొన్నారు. ఇప్పటివరకూ కొనసాగిన విధానంలోనే వైద్య సేవలందించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: