ETV Bharat / city

నకిలీ ధ్రువపత్రాలతో కారు లోన్.. హెల్త్ ఇన్​స్పెక్టర్ అరెస్ట్ - తెలంగాణ వార్తలు

నకిలీ ధ్రువ పత్రాలతో కారు రుణం తీసుకున్న హెల్త్ ఇన్​స్పెక్టర్ అనూప్ దేవదాసన్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితుడికి గుర్రపు పందెం వంటి వ్యసనాలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.

health inspector arrest
health inspector arrest
author img

By

Published : May 7, 2021, 7:52 PM IST

నకిలీ ధ్రువ పత్రాలతో కారు కోసం రూ.19 లక్షల రుణం తీసుకొని ఈఎంఐలు చెల్లించని హెల్త్ ఇన్​స్పెక్టర్ అనూప్ దేవదాసన్​ను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ మన్సూరాబాద్​లోని హిమపురి కాలనీలో ఆయన నివాసముంటారని పేర్కొన్నారు. నిజామాబాద్​లో హెల్త్ ఇన్​స్పెక్టర్​గా పని చేస్తున్న ఆయన... 2018 లో హిమాయత్​నగర్ ఎస్బీఐ శాఖలో రుణం తీసుకున్నారని పోలీసులు తెలిపారు. మూడు నెలలుగా ఈఎంఐలు చెల్లించలేదని పేర్కొన్నారు. బ్యాంకు అధికారులు చాలాసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని అన్నారు.

చివరికి ఆయన రుణం ఫైల్​ను పరిశీలించగా... ధ్రువ పత్రాలన్నీ నకిలీవని తేలాయని చెప్పారు. 2019లో ఆ బ్యాంకు మేనేజర్ సీఎన్ఏవీఆర్​కే శర్మ నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. ఎట్టకేలకు రెండేళ్లకు అనూప్ దేవదాసన్ చిక్కాడని వెల్లడించారు. జల్సా జీవితానికి అలవాటుపడిన ఆయన గుర్రపు పందెం, ఇతర వ్యసనాలకు బానిసయ్యాడని తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించామని వివరించారు.

ఇదీ చదవండి:

కర్నూలులో తెదేపా అధినేత చంద్రబాబుపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.