ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్​: తాజా హెల్త్​ బులెటిన్ విడుదల - కరోనా కేసుల వార్తలు

కరోనా వ్యాప్తికి సంబంధించి రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ హెల్త్​ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. విదేశాల నుంచి వచ్చిన 14,907 మందిలో 13,290 మంది హోమ్ ఐసోలేషన్​లో ఉన్నట్లు ప్రకటించింది.

health-bulletin-release-on-latest-conditions-of-corona-in-andhrapradesh

author img

By

Published : Mar 25, 2020, 5:44 PM IST

కరోనా వ్యాప్తికి సంబంధించి రాష్ట్రంలోని తాజా పరిస్థితిపై వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇవాళ కొత్తగా ఎవరికీ కరోనా పాజిటివ్ కేసు నిర్ధరణ కాలేదని తెలియజేసింది. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన కారణంగా.. విదేశాల నుంచి రాష్ట్రానికి ఎవరూ రాలేదని... ప్రస్తుతం ఉన్నవారిపైనా పర్యవేక్షణ కొనసాగుతోందని స్పష్టం చేసింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఇంటింటి రీసర్వే చేపట్టినట్టు తెలియజేసింది.

కేసుల వివరాలు

రాష్ట్రంలో ఇప్పటి వరకూ 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలియజేసింది. ఇందులో నెల్లూరులోని ఓ రోగికి చికిత్స అనంతరం రెండుసార్లు నిర్వహించిన వైద్య పరీక్షల్లో నెగెటివ్ ఫలితాలు వచ్చాయని వెల్లడిచింది. ఇప్పటి వరకూ 270 కేసుల్లో నమూనాలు సేకరిస్తే 229 మందికి కరోనా లేనట్టు తేలిందని వివరించింది. ప్రస్తుతం మరో 33 మందికి సంబంధించిన నమూనాల్లో ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందని ప్రకటించింది.

హోమ్​ ఐసోలేషన్​లో 13290 మంది

"విదేశాల నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రానికి 14907 మంది వచ్చారు. ఇందులో 13,290 మంది హోమ్ ఐసోలేషన్​లో ఉన్నారు. 95 మంది ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ వార్డుల్లో వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. 2,723 మందికి 28 రోజుల పరిశీలన పూర్తైంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రస్తుతం గ్రామ, వార్డు వాలంటీర్లు, ఆశావర్కర్లతో ఇంటింటి రీసర్వే కార్యక్రమం చేపడుతున్నారు. రోగ లక్షణాలను ఉన్నవారిని గుర్తించి తదుపరి చర్యలు, చికిత్సల కోసం ఈ కార్యక్రమం చేపట్టారు" అని వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో ఒడిశా విద్యార్థులు.. చివరికి ఎలా ఇళ్లకు చేరారంటే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.