HC ON KABADDI : ఏపీ స్పోర్ట్స్ అథారిటీ పంపిన పేర్లను కబడ్డీ క్రీడలకు అనుమతించాలని భారత అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్‌ను హైకోర్టు ఆదేశించింది. ఉత్తరాఖండ్ రుద్రపూర్ జిల్లాలో డిసెంబర్ 28 నుంచి 31 వరకు జరిగే సబ్ జూనియర్ జాతీయ ఛాంపియన్ షిప్ , మహారాష్ట్రలో జనవరిలో జరిగే సీనియర్ మహిళ జాతీయ కబడ్డీ ఛాంపియన్ షిప్‌నకు శాప్ పంపిన క్రీడాకారుల పేర్లను క్రీడలకు అనుమతించాలని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. విచారణను జనవరి 20కి వాయిదా వేశారు.
జాతీయ కబడ్డీ క్రీడలకు పంపేందుకు పేర్లను ఎంపిక చేసేలా ఏపీ స్పోర్ట్ అథారిటీని, ఆ పేర్లను పరిగణనలోకి తీసుకునేలా భారత ఆమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్‌ను ఆదేశించాలని కోరుతూ 16 మంది మహిళ కబడ్డీ క్రీడాకారులు హైకోర్టును ఆశ్రయించారు. వివాదాల కారణంగా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ నుంచి ప్రతిభ ఉన్న క్రీడాకారుల పేర్లను ఎంపిక చేసి పోటీలకు పంపడం లేదన్నారు.
ఇదీ చదవండి:
తిరుపతి నడిబొడ్డున "సభా సంగ్రామం".. నలుదిక్కులా అమరావతి పొలికేక!