ETV Bharat / city

నేటి నుంచి రాజధాని వ్యాజ్యాలపై రోజువారీ విచారణ - ఏపీలో రాజధాని పిటిషన్ వార్తలు

రాజధాని మార్పు సంబంధిత కేసులపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం నుంచి రోజువారీ విచారణ చేయాలని నిర్ణయించింది. రాజధాని మార్పుపై మొత్తం 229 అనుబంధ పిటిషన్లు ఉన్నట్లు తెలిపింది. పిటిషన్లను అంశాల వారీగా విభజించి విచారణ జరపనున్నట్లు వెల్లడించింది.

hc on amaravathi
hc on amaravathi
author img

By

Published : Oct 5, 2020, 12:50 PM IST

Updated : Oct 6, 2020, 12:18 AM IST

రాజధాని అమరావతికి సంబంధించిన పిటీషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ముఖ్యంగా అనుబంధ పిటీషన్లపై జరపనున్న విచారణపై న్యాయవాదులను వివరాలు కోరింది ధర్మాసనం. ఇప్పటివరకు రాజధానికి సంబంధించి 229 అనుబంధ పిటీషన్లు దాఖలైనట్లు ధర్మాసనం తెలిపింది . దీంట్లో మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన పిటీషన్లను ముందుగా విచారించనున్నట్లు త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. మంగళవారం నుంచి రోజు వారీ విచారణ జరపనున్నారు . ముందుగా రాజధానిపై దాఖలైన అనుబంధ వ్యాజ్యాలను అంశాల వారీగా విభజించనున్నారు.

మంగళవారం నుంచి ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం వరకు రాజధాని అంశాలకు సంబంధించిన వ్యాజ్యాలను విచారించనున్నట్లు త్రిసభ్య ధర్మాసనం తెలిపింది . అనుబంధ పిటీషన్లపై విచారణ ముగిసిన తర్వాత ..ప్రధాన పిటీషన్లను విచారించనున్నారు. ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారానే విచారణ కొనసాగుతుందని ధర్మాసనం తెలిపింది .

అంశాలవారీగా విచారణ....

రాజధాని నుంచి కార్యాలయాల తరలింపు , సీఆర్డీఏ రద్దు చట్టం , మూడు రాజధానుల ఏర్పాటు చేస్తూ చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన పిటీషన్లు , ఆర్ 5 జోన్ , శాసనమండలి లో సీఆర్డీఏ రద్దు ,రాజధాని వికేంద్రీకరణ బిల్లులు పెండింగ్ లో ఉండగా రెండో సారి బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదించటం విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణం తదితర అంశాలపై దాఖలైన పిటీషన్లపై విచారణ జరిపారు . విశాఖలో 30 ఎకరాల్లో గెస్ట్ హౌస్ నిర్మాణంపై దాఖలు చేసిన పిటీషన్ లో సీఎస్ కౌంటర్ దాఖలు చేశారు . అయితే ఆ కౌంటర్ లో గెస్ట్ హౌస్ కు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించలేదని పిటీషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు . ప్రభుత్వం మరో రెండు చోట్ల గెస్ట్ హౌస్ నిర్మాణాలు చేపడుతుందని వాటికి .. విశాఖలో జరుగుతున్న గెస్ట్ హౌస్ నిర్మాణానికి చాలా వ్యత్యాసం ఉన్నదని పిటీషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు . దీనికి ఏజీ స్పందిస్తూ.... విశాఖకు మిగతా నగరాలకు వ్యత్యాసం ఉన్నదన్నారు . విశాఖకు అధిక సంఖ్యలో గెస్ట్ లు వస్తారని తెలిపారు . మరోవైపు ఇళ్ల పట్టాలకు సంబంధించిన పిటీషన్లను కూడా త్వరగా విచారించాలని ఏజీ ధర్మాసనాన్ని కోరారు . దీనికి స్పందించిన ధర్మాసనం ప్రయార్టీ వారీగా పిటీషన్లను విచారిస్తామని తెలిపింది .

అనుబంధ పిటీషన్లపై ఇరువర్గాల న్యాయవాదులందరి అభిప్రాయాలను ధర్మాసనం కోరింది . రాజధాని అంశానికి సంబంధించని పిటీషన్లను జాబితా నుంచి వేరు చేశారు.

ఇదీ చదవండి: పోలీసుల ఉదాసీనత వల్లే రాజ్యాంగ ఉల్లంఘనలు: చంద్రబాబు

Last Updated : Oct 6, 2020, 12:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.