తక్కువ రుసుము వసూలుచేసే సెలూన్లకు వెళ్లేవారంతా ఇంటినుంచే తువ్వాలు తీసుకెళ్లాలి. ఎక్కువ రుసుము ఉండే సెలూన్లలో వినియోగదారులు ముందస్తు అనుమతులు తీసుకోవాలి. ఈ మేరకు సవరించిన ఉత్తర్వుల్లో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ సూచించింది. లాక్‌డౌన్ ఈనెల 31 వరకు పొడిగిస్తూ కంటెయిన్‌మెంట్, కోర్, బఫర్ జోన్లలో కాకుండా మిగతా ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు పురపాలకశాఖ ప్రత్యేక మార్గదర్శకాలు జారీచేసింది. వీటిలో సవరించిన మార్గదర్శకాలు బుధవారం వెలువడ్డాయి. అవి ఇలా..
ఎక్కువ రుసుం వసూలుచేసే సెలూన్లలో..
- అందరికీ థర్మల్ స్కానింగ్ తప్పనిసరి. ఖాతాదారుడి పేరు, నంబరు తీసుకోవాలి. ఖాతాదారులు ముందస్తు అనుమతితో రావాలి తప్ప ఎక్కువమంది నిరీక్షించకూడదు.
- సిబ్బంది వ్యక్తిగత రక్షణ పరికరం (పీపీఈ) ఉపయోగించాలి. ఖాతాదారులకు మాస్క్ ఉండాలి.
- ఖాతాదారుల కుర్చీలను తరచు శుభ్రపరచాలి. షాపు తెరిచేటప్పుడు, మూసే ముందు సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో క్రిమిరహితం చేయాలి.
తక్కువ రుసుం వసూలుచేసే సెలూన్లలో
- యజమాని, సిబ్బంది మాస్కులు, చేతి గ్లోవ్స్ వినియోగించాలి.
- క్షవరం పూర్తయ్యాక ఖాతాదారు కూర్చున్న కుర్చీ, ఆవరణను ద్రావణంతో క్రిమిరహితం చేయాలి.
- ఒకసారి వినియోగించిన రేజర్లు రెండోసారి ఉపయోగించరాదు.
వ్యాపార సంస్థలు, దుకాణాల్లో..
- నగదు రహితంతో పాటు బిల్లుల వసూళ్లు వేగంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలి. వచ్చేందుకు, వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలుండాలి. థర్మల్ స్క్రీనింగ్, మాస్క్‌లు తప్పనిసరి.
- దుకాణంలో సిబ్బంది సగం మందే ఉండాలి. వీరంతా శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొవిడ్ లక్షణాలున్న సిబ్బందిని అనుమతించరాదు.
- చిన్నారులు, వృద్ధులను అనుమతించరాదు. మరుగుదొడ్లు గంటకోసారి విధిగా శుభ్రం చేయించాలి.
ఇదీ చదవండి: