రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం... వైకాపా ప్రభుత్వ పతనానికి నాంది కాబోతోందని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు అన్నారు. రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారిందని దేశం మొత్తం తెలిసిందన్న ఆయన.. కొత్త అప్పుల కోసం రోజూ ప్రయత్నాలు చేసే పరిస్థితికి ప్రభుత్వం దిగజారిందని పేర్కొన్నారు. ఓటు బ్యాంకు పథకాల కోసం రుణాలు చేస్తున్నారని విమర్శించిన జీవీఎల్.. ఏపీ అప్పులు, రాజ్యాంగ ఉల్లంఘనలపై కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లతానని స్పష్టం చేశారు. అప్పుల కోసమే ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లుందన్న ఆయన.. బుగ్గన అప్పుల మంత్రిగా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అప్పులపై కాగ్, ఆర్‌బీఐతో ఆడిట్ చేయించాలని కేంద్రాన్ని కోరుతానని తెలిపారు.
రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతులను చూసి నిధుల సమీకరణతో పథకాలు ఇవ్వాలని చెప్పారు. రాష్ట్రం అప్పుల చేయడం ఆపేలా చూడాలని కేంద్రాన్నికోరతానన్న జీవీఎల్.. ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తానని చెప్పారు.
ఇదీ చదవండి: