Gvl Narasimha Rao Comments: సీఎం జగన్ విశాఖ అభివృద్ధికి సహకరించకుండా.. రాజధాని చేస్తామంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నారని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. అమరావతిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తే కార్యాలయాలు నెలకొల్పుతామని కేంద్ర సంస్థలు లేఖలు రాస్తున్నా.. వైకాపా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అమరావతిలో అక్రమాలంటూ మూడేళ్లుగా ఆరోపణలే చేస్తున్నారు.. అక్రమాలు అన్నదానికి ఒక్క ఆధారమైనా బయటపెట్టారా అని జీవీఎల్ నిలదీశారు.
"మూడు రాజధానులు సాధ్యం కాదని వైకాపా ప్రభుత్వానికి తెలుసు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అయినా మళ్లీ మూడు సంవత్సరాల క్రితం మాటలే మాట్లాడుతున్నారు. విశాఖపట్నంలో రాజధాని పెడతామని అన్నారు. విశాఖ అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం నుంచి అనేక సహకారాలు రావాలి.. రావటం లేదు". -నరసింహారావు, భాజపా ఎంపీ
ఇవీ చదవండి: