ETV Bharat / city

మొక్కలు నాటిన గుత్తా జ్వాల దంపతులు.. వారిద్దరికీ "గ్రీన్​ ఛాలెంజ్​"! - hyderabad news

Gutta Jwala Couple on Green India Challenge: గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి గుత్తా జ్వాల దంపతులు పాల్గొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్​లోని జీహెచ్​ఎంసీ పార్కులో మొక్కలు నాటిన వారు.. మరో ఇద్దరికి ఈ ఛాలెంజ్​ విసిరారు.

GUTHA JWALA WITH HUSBAND GREEN CHALLENGE
మొక్కలు నాటిన గుత్తా జ్వాల దంపతులు.. వారిద్దరికి గ్రీన్​ ఛాలెంజ్​.!
author img

By

Published : Feb 6, 2022, 7:37 PM IST

Gutta Jwala Couple on Green India Challenge: ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి గుత్తా జ్వాల, సినీనటుడు విష్ణు విశాల్.. గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొని మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా.. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోని​ జూబ్లీహిల్స్​లో ఉన్న జీహెచ్​ఎంసీ పార్కులో మొక్కలు నాటి నీరు పోశారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గుత్తా జ్వాల దంపతులు కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టి ప్రతి ఒక్కరినీ ఇందులో భాగస్వామ్యం చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్​కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. నటుడు రవితేజ, డైరెక్టర్ మను ఆనంద్​కి విష్ణు విశాల్ ఈ ఛాలెంజ్ విసిరారు. అనంతరం వారికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ.. వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు.

ఇదీ చదవండి: Blood Donation Camp in Marriage: "పెళ్లికి తప్పకుండా రండి.. రక్తదానం చేయండి.."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.