గుంటూరులో మురుగు పారుదలకు అడ్డుగా ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని నగర కమిషనర్ అనురాధ అధికారాలను ఆదేశించారు. ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫాతో కలసి నగరంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. కాలువల మీద ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని చెప్పారు. సచివాలయాలవారీగా ఎన్విరాన్మెంట్, ఎమినిటీ, ప్లానింగ్ కార్యదర్శులు సంయుక్తంగా ఆక్రమణల తొలగింపు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రధాన కాలువల్లో.. ప్రతి రోజు మురుగు నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని.. అవసరమైన ప్రాంతాల్లో గ్యాంగ్ వర్క్ తో శుభ్రం చేయించాలని చెప్పారు. రోడ్లను ఆక్రమించి నిర్మించిన గోడలు, గృహాలను మాస్టర్ ప్లాన్ ప్రకారం పరిశీలించి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు.
ప్రజారోగ్యం దృష్ట్యా కాలువల మీద ఆక్రమణలు వెంటనే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని ఎమ్మెల్యే ముస్తఫా సూచించారు. కాలువల్లో చెత్త వేసిన వారిపై భారీ అపరాధ రుసుము విధిస్తేనే మార్పు వస్తుందని వ్యాఖ్యానించారు. మణిపురం బ్రిడ్జి కింద స్థలం ఖాళీగా ఉండటం వల్ల చెత్త వేయడం, అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారిందని ఎమ్మెల్యే విమర్శించారు. ఆ ప్రాంతాలను శుభ్రం చేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కమిషనర్‌ను కోరారు.
ఇదీ చదవండి: