ETV Bharat / city

GULAB EFFECT: తీరం దాటిన గులాబ్‌ తుపాను..గాలుల బీభత్సం - rains news

రెండు రోజులుగా ఉత్తరాంధ్రను వణికించిన గులాబ్‌ తుపాను(gulab cyclone effect) తీరం దాటింది. తుపాను ప్రభావంతో అనేక చోట్ల అత్యధికంగా వర్షపాతం నమోదైంది. అనేక చోట్ల విద్యుత్తు సరఫరా వ్యవస్థలు దెబ్బతినడంతో..పునరుద్ధరించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపధికన చర్యలు చేపట్టారు.

GULAB EFFECT
GULAB EFFECT
author img

By

Published : Sep 27, 2021, 3:35 AM IST

.

రెండు రోజులుగా ఉత్తరాంధ్రను వణికించిన గులాబ్‌ తుపాను ఆదివారం రాత్రి 9.30 గంటలకు శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి ఉత్తరంగా 20 కిలోమీటర్ల దూరంలో తీరం దాటింది. ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు గార సమీపంలో కళింగపట్నం తీరాన్ని తాకిన తుపాను మరో మూడు గంటల తర్వాత తీరం దాటింది. ఈ సమయంలో గంటకు 75 నుంచి 85 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. తీరం దాటాక ఆరు గంటల్లో తుపాను క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. గులాబ్‌ ప్రభావంతో శనివారం రాత్రి నుంచే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు మొదలయ్యాయి. ముఖ్యంగా సిక్కోలు జిల్లా చిగురుటాకులా కంపించింది. తుపాను తీరం దాటాక.. విశాఖపట్నం నగరంతోపాటు చుట్టుపక్కల మండలాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. తుపాను పరిస్థితిపై ప్రధాని మోదీ సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా ముఖ్యమంత్రులు జగన్‌మోహన్‌ రెడ్డి, నవీన్‌ పట్నాయక్‌లతో ఆయన మాట్లాడారు. గులాబ్‌ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో విపత్తు సహాయ దళాలను మోహరించారు. కమిషనర్‌ కన్నబాబు పరిస్థితిపై ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో సమీక్షించారు.

.

అత్యధికంగా కళింగపట్నంలో 19.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఆదివారం మధ్యాహ్నం వీచిన ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. విజయనగరం జిల్లాలోనూ ఆదివారం రోజంతా ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. పూసపాటిరేగ, భోగాపురంలోని తీరప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ముక్కాంలో సముద్రం 50 మీటర్లు ముందుకొచ్చింది. భోగాపురం మండలం చేపలకంచేరుకు చెందిన అయిదుగురు మత్స్యకారులు వేటకు వెళ్లి తిరిగొస్తుండగా బోటు బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో సూరపతి దానయ్య అనే వ్యక్తికి పంకా తగిలి తీవ్ర గాయాలయ్యాయి. సహచరులు ఒడ్డుకు చేర్చి విజయనగరంలోని కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇచ్ఛాపురం, మందస, కంచిలి, కవిటి, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రణస్థలం తదితర మండలాల్లో కొబ్బరి చెట్లు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. కొన్ని చెట్లు విద్యుత్తు తీగలపై పడటంతో వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళితో పాటు మరో నాలుగు మండలాల్లో మధ్యాహ్నం నుంచి విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. మందస మండలంలో కొబ్బరిచెట్టు పడి ఓ బాలుడు తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటకు చెందిన బుంగ మోహనరావుతోపాటు మరో అయిదుగురు మత్స్యకారులు ఒడిశా నుంచి తిరిగి వస్తుండగా ఈదరుగాలులకు పడవ అదుపుతప్పి సముద్రంలో పడిపోయారు. వీరిలో అయిదుగురు సురక్షితంగా తీరానికి చేరుకోగా మోహనరావు గల్లంతయ్యారు.

.

విద్యుత్తు సిబ్బందికి సెలవుల రద్దు

గులాబ్‌ తుపాను నేపథ్యంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విద్యుత్తు సిబ్బంది సెలవులు రద్దు చేస్తున్నట్లు ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్‌ పేర్కొన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు ముందస్తు చర్యల్లో భాగంగా సామగ్రిని సిద్ధంగా ఉంచాలని, ప్రత్యామ్నాయ మార్గాల్లో విద్యుత్‌ సరఫరా అందించేలా తగు ప్రణాళిక ఉండాలని అధికారులను ఆదేశించారు. 24 గంటలపాటు పనిచేసే కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. మూడు జిల్లాల్లో 20,438 విద్యుత్‌ స్తంభాలు, 1.55 లక్షల 11 కేవీ స్తంభాలు, పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లు, 3,540 మంది సిబ్బంది, జేసీబీలు, జనరేటర్లు, క్రేన్లు, పోల్‌ డ్రిల్లింగ్‌ యంత్రాలను అందుబాటులో ఉంచినట్లు ఈపీడీసీఎల్‌ సీఎండీ సంతోష్‌రావు వివరించారు. తుపాను ప్రభావం నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు తీర ప్రాంత మండలాలకు చేరుకున్నాయి. పడిపోయిన చెట్లను హుటాహుటిన తొలగించి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 13 తుపాను ప్రభావిత మండలాల్లో 61 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ తెలిపారు. 38 కేంద్రాల్లోకి 1,358 మందిని తరలించి, వారికి భోజనం, ఇతర ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ‘గులాబ్‌’ తుపాను బాధితులకు సహాయక చర్యలు చేపట్టేందుకు భారత నౌకాదళం సన్నద్ధతతో ఉందని తూర్పునౌకాదళ వర్గాలు తెలిపాయి. నౌకల ద్వారా ఆహారాన్ని పంపిణీ చేసేందుకు, అత్యవసర సహాయక బృందాలను తరలించేందుకు ఎయిర్‌క్రాఫ్ట్‌లను అందుబాటులో ఉంచామన్నాయి.

.

కేంద్రం నుంచి తక్షణ సాయం

.

గులాబ్‌ తుపాను కారణంగా ఉత్పన్నమవుతున్న పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం తరఫున అన్నిరకాలుగా సహకరిస్తామని ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌, నవీన్‌ పట్నాయక్‌లతో మాట్లాడారు. ‘తుపాను పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో మాట్లాడాను, కేంద్రం నుంచి తక్షణ సాయం అందేలా చూస్తాం. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా’ అని మోదీ తెలుగులో ట్వీట్‌ చేశారు.

తుపాను పరిస్థితులపై సీఎస్‌ సమీక్ష

గులాబ్‌ తుపాను పరిస్థితులను తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఆదివారం సాయంత్రం విశాఖ నగరానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం నగరంలోని ఓ హోటల్లో ఆయన జీవీఎంసీ కమిషనర్‌ సృజన, జేసీ వేణుగోపాల్‌రెడ్డి, విశాఖ రూరల్‌ ఎస్పీ కృష్ణారావు తదితరులతో సమీక్ష నిర్వహించారు. తుపాను నేపథ్యంలో చేసిన ఏర్పాట్లపై చర్చించి తగిన ఆదేశాలు జారీ చేశారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లతోనూ మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. సోమవారం ఉదయం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో సీఎస్‌ పర్యటించనున్నారు.

.
ప్రాంతాల వారీగా నమోదైన వర్షపాత వివరాలు

ఇదీ చదవండి:

GULAB CYCLONE CROSSED: శ్రీకాకుళం జిల్లాలో 'గులాబ్' తుపాను తీరం దాటింది: కలెక్టర్ శ్రీకేశ్​ లాఠకర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.