ETV Bharat / city

ఏపీ మత్స్యకారులను జాగ్రత్తగా చూసుకుంటాం: గుజరాత్​ సీఎంవో​ - ap fisher men in gujrat

గుజరాత్​లో చిక్కుకున్న ఏపీ మత్స్యకారులను జాగ్రత్తగా చూసుకుంటామని ఆ రాష్ట్ర సీఎం కార్యాలయ అధికారి అశ్విన్​కుమార్​ చెప్పారు. వారికి వసతి భోజన సదుపాయాల్లో ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.

gujrat government reacts on ap fisher man in their state
గుజరాత్​ సీఎంవో​
author img

By

Published : Apr 21, 2020, 5:15 PM IST

ఏపీ మత్స్య కారులపై మాట్లాడుతున్న గుజరాత్​ సీఎంఓ అధికారి

గుజరాత్​లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను సురక్షితంగా చూసుకుంటామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి అశ్విన్​కుమార్​​ చెప్పారు. వసతి, భోజన సదుపాయాల్లో ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం విజయ్​రూపాని ఆదేశించినట్లు వివరించారు. చేపల వేటకు అనుమతించామని... మత్స్యకారులు రోజూవారీ పనులు చేసుకుంటూ నిశ్చింతగా ఉండవచ్చని భరోసా ఇచ్చారు.

ఈ రోజు ఉదయం.. మత్స్యకారుల అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​.. గుజరాత్​ ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఏపీ మత్స్యకారులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వసతి, భోజన సదుపాయాల్లో ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తికి స్పందించిన గుజరాత్ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి అశ్విన్​కుమార్ తెలిపారు.

ఇదీ చదవండి: గుజరాత్‌ ముఖ్యమంత్రికి జగన్‌ ఫోన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.