ETV Bharat / city

"ఏడాదిన్నరగా ఆఫీస్​కు రావట్లేదు.. విమలేశ్ ఎక్కడ"..? పడుకున్నాడు సర్..!!! - ఏపీ తాజా వార్తలు

"ఏమండీ.. మేము అహ్మదాబాద్ ఇన్​కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం. విమలేశ్ ఆఫీసుకు రావట్లేదు.. అతను కనిపించక ఏడాదిన్నర కాలమైంది! ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు..?" "సర్.. అదీ.. అతని ఆరోగ్యం కాస్త బాగోలేదండీ.. ఏడాదిన్నర కాలం నుంచీ పడుకునే ఉన్నాడు. త్వరగానే లేస్తాడు.. లేవగానే ఆఫీసుకు వచ్చేస్తాడు..!!"

Gujarat income tax officer
ఇన్​కమ్ ట్యాక్స్ ఆఫీస్
author img

By

Published : Sep 28, 2022, 7:37 PM IST

విమలేశ్.. కాన్పూర్ వాసి. ఆదాయపు పన్ను శాఖలో ఆఫీసర్. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్​లో డ్యూటీ చేస్తున్నాడు. వయసు 35 ఏళ్లు. గతేడాది ఏప్రిల్​లో కొవిడ్ బారిన పడ్డాడు. 2021 ఏప్రిల్ 19న మోతీ ఆసుపత్రిలో చేరారు. కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉన్నాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు కాన్పుర్​లోని తమ ఇంటికి తీసుకెళ్లారు. అప్పటి నుంచీ అతనికి ఇంట్లోనే చికిత్స అందిస్తోంది ఆ కుటుంబం.

వారిది ఉమ్మడి కుటుంబం. తల్లిదండ్రులు, అతని సోదరుల కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. విమలేశ్ భార్యతోపాటు ఉమ్మడి కుటుంబంలోని సభ్యులంతా.. అతన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు. డెట్టాల్, శానిటైజర్ వంటి క్రిమిసంహారక మందులతో అతని శరీరాన్ని రోజుకు మూడుసార్లు శుభ్రం చేస్తున్నారు. ప్రతిరోజూ అతని బట్టలు వీళ్లే మారుస్తున్నారు. 24 గంటలు ఏసీ ఆన్ చేసి.. అతనికి ఏవిధమైన ఇబ్బందీ లేకుండా చూసుకుంటున్నారు.

విమలేశ్ ఆఫీసుకు వెళ్లక చాలా కాలమైంది.. ఈ విషయం కనుక్కునేందుకు ఆఫీసు నుంచి ఫోన్ చేశారు. ఆరోగ్యం బాగోలేదని.. రెస్ట్ తీసుకుంటున్నారని చెప్పారు కుటుంబ సభ్యులు. నెల రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేశారు.. ఈ సారి కూడా ఆన్సర్ రిపీట్ చేశారు.. మరోసారి ఫోన్ చేసినా.. ఆన్సర్ మారలేదు. ఇటు.. ఇంటిపక్క వారికీ, తెలిసిన వారికీ విమలేశ్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడని చెప్తున్నారు. స్థానికులు వచ్చి.. విమలేశ్​ను చూసి.. కుటుంబ సభ్యులను పరామర్శించి వెళ్తున్నారు.

ఈ ఫోన్లు.. పరామర్శలతో.. చూస్తుండగానే ఏడాదిపైనే కాలం గడిచిపోయింది. చివరకు.. ఏడాదిన్నర తర్వాత.. తాజాగా నాలుగు రోజుల క్రితం ఆఫీస్ నుంచి మళ్లీ ఫోన్ చేశారు. ఇప్పుడు కూడా అదే మాట చెప్పారు. దీంతో.. అక్కడ ఏం జరుగుతోంది? అసలు విమలేశ్ ఉన్నాడా లేడా? కుటుంబ సభ్యులు ఏమైనా అబద్ధం చెబుతున్నారా? అనేది తెలుసుకొని రావాలంటూ.. ఆఫీస్ నుంచి ఓ బృందాన్ని పంపించారు. బృంద సభ్యులు.. విమలేశ్ ఇంటికి వెళ్లి తలుపు తట్టారు. కుటుంబ సభ్యులు డోర్ తెరిచారు. "విమలేశ్ ఎక్కడ?" అని అడిన వారికి.. "అదిగో అక్కడ" అని చూపించారు. వాళ్లు వెళ్లి చూశారు.. నిజంగానే విమలేశ్ అక్కడ ఉన్నాడు. కానీ.. ప్రాణాలతో కాదు..! అవును అతను చనిపోయాడు.. ఇప్పుడు కాదు.. నిన్నామొన్నా కానేకాదు.. ఎప్పుడో మరణించాడు. అంటే.. వీళ్లు ఇంతకాలం ట్రీట్​మెంట్​ చేస్తున్నదీ.... "యస్.. శవానికి!"

వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.. గంటల్లోనే ఎంక్వైరీ ఫినిష్ చేశారు. తేలింది ఏమంటే.. 2021 ఏప్రిల్ 19న మోతీ ఆసుపత్రిలో చేరిన తర్వాత మూడో రోజునే విమలేశ్ చనిపోయాడు. వైద్యులు ధ్రువీకరించి.. ఇంటికి తీసుకెళ్లమన్నారు. అతన్ని వదులుకోలేక.. సెకండ్ ఒపీనియన్ కోసం మరో డాక్టర్ వద్దకు వెళ్లారు. అతను కూడా కన్ఫామ్ చేశాడు. ఇక.. ఇంటికి తీసుకెళ్లి దహనం చేద్దామని అనుకున్నారు కూడా.. కానీ, కుటుంబ సభ్యుల్లో ఒకరికి వచ్చిన డౌట్.. మొత్తం సీన్ మార్చేసింది.

చచ్చిపోయిన కుటుంబ సభ్యుల ఆశలు తిరిగి ప్రాణం పోసుకున్నాయి. వారి ఆశలాగే.. విమలేశ్ ప్రాణం కూడా తిరిగి వస్తుందని ఆశించారు. అతను కోమాలో ఉన్నాడు కావొచ్చని అనుకున్నారు. అదే ఫిక్స్ అయ్యారు. వైద్యులు ఈ విషయాన్ని గుర్తించలేకపోయారని అనుకుంటూ.. ఇంటికి తీసుకెళ్లారు. ప్రత్యేకంగా ఒక గది కేటాయించి.. నిత్యం ఏసీ ఆన్ చేసి.. మూడు పూటలూ డెటాల్ తో శరీరాన్ని తుడుస్తూ.. ఆక్సిజన్ సిలిండర్ మారుస్తూ.. ఎప్పుడు లేస్తాడా..? అని విమలేశ్ వంక చూస్తూ ఉండిపోయింది ఆ కుటుంబం. కానీ.. అతను లేవలేదు.

పోలీసులు వచ్చి చూస్తే.. చర్మం అతికించినట్టుగా ఉన్న అస్తిపంజరం మాత్రమే ఉందక్కడ! మెడికల్ రిపోర్ట్స్.. కుటుంబ సభ్యుల సేవలు అన్నీ చూసిన తర్వాత.. విమలేశ్ మరణంలో ఎలాంటి కుట్రకోణమూ లేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత.. కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి.. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

ఇంతకీ.. ఆ కుటుంబ సభ్యుడికి వచ్చిన డౌట్ ఏంటీ.. అంటారా? "ఆక్సిజన్ టెస్టింగ్". కరోనా వచ్చిన వారిలో ఆక్సిజన్ పర్సంటేజ్ తెలుసుకునేందుకు ఆక్సీమీటర్ వినియోగిస్తారన్న సంగతి తెలిసిందే. దాన్ని.. విమలేశ్ చేతికి పెట్టి చూశాడు ఓ కుటుంబ సభ్యుడు. అప్పుడు ఆ మీటర్​లో ఏదో ఒక నంబర్ కనిపించిందట. దీంతో.. అతను ప్రాణాలతోనే ఉన్నాడని.. కోమాలో ఉండొచ్చు అని భ్రమపడి.. శ్మశానానికి బదులు.. ఇంటికి తీసుకెళ్లారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.