ETV Bharat / city

తెలంగాణ: ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి ఆర్థిక సాయం పంపిణీకి మార్గదర్శకాలు ఖరారు - telangana news 2021

తెలంగాణలోని ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి ఆర్థిక సాయం పంపిణీకి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది.

financial aid to private teachers
తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు
author img

By

Published : Apr 10, 2021, 12:50 AM IST

తెలంగాణలోని ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి ఆర్థిక సాయం పంపిణీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఈ మేరకు విద్యాసంస్థల నుంచి వివరాలను ఆన్‌లైన్‌లో తీసుకోనుంది. schooledu.telangana.gov.in వెబ్​సైట్‌లో ప్రధానోపాధ్యాయుల ద్వారా వివరాల నమోదుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం.. ఉపాధ్యాయులు, సిబ్బంది బ్యాంకు ఖాతాలు, ఆధార్ వివరాలు తప్పనిసరి చేసింది.

ఈ వివరాలను ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఇతర అధికారుల ద్వారా డీఈవోలు తనిఖీ చేయించనున్నారు. అనంతరం ధ్రువీకరించుకున్న వివరాలను కలెక్టర్ల ద్వారా విద్యాశాఖకు పంపనున్నారు. రేపటి నుంచి ఈ నెల 15 వరకు పాఠశాలల నుంచి వివరాల సేకరణ ప్రక్రియ సాగనుంది. 16 నుంచి 19 వరకు వివరాల తనిఖీ, క్రోడీకరణ జరగనుంది. ఈ నెల 20 నుంచి 24 వరకు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేయనుండగా.. 21 నుంచి 25వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయనున్నారు.

ఇదీ చదవండి:

పెరుగుతున్న అద్దె భారం..ప్రభుత్వ భవనాల్లోకి కార్యాలయాలు !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.