భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఫిబ్రవరిలో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 10 వాహక నౌక ప్రయోగం చేయనున్నట్లు సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ అసోసియేట్ డైరెక్టర్ ఎంబీఎన్ మూర్తి వెల్లడించారు. ఆదివారం షార్‌లో ఆయన మాట్లాడుతూ.. జీఎస్‌ఎల్‌వీ ప్రయోగానికి చురుగ్గా అనుసంధాన కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిపారు. మార్చిలో పీఎస్‌ఎల్‌వీ-సి49, సి-50 వాహకనౌకలను నింగిలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 12 ప్రయోగాలను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ఇవీ చూడండి...
నెల్లూరులో విక్రమం సింహపురి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకలు