ETV Bharat / city

డ్రైవింగ్ రాకపోయినా కారు నడిపి.. ప్రాణం తీసిన పెళ్లికొడుకు..!

CC footage: పెళ్లి బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తున్న వారిపైకి కారు దూసుకెళ్లడంతో ఒక బాలుడు మరణించాడు. తెలంగాణలోని నల్గొండ జిల్లా చండూరు మండలం గట్టుప్పల గ్రామంలో బుధవారం అర్ధరాత్రి తర్వాత ఈ ప్రమాదం జరిగింది.

CC footage
బరాత్‌లో పెళ్లికొడుకు అత్యుత్సాహం
author img

By

Published : May 27, 2022, 2:28 PM IST

బరాత్‌లో పెళ్లికొడుకు అత్యుత్సాహం

తెలంగాణలోని నల్గొండ జిల్లా చండూరు మండలం గట్టుప్పలకు చెందిన మల్లేశ్‌ వివాహం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురంలో బుధవారం జరిగింది. అదే రోజు రాత్రి వధువుతో కలిసి స్వగ్రామానికి కారులో వచ్చారు. డీజే పాటలతో ఇంటివరకు బరాత్‌ ఏర్పాటుచేశారు. వరుడి ఇల్లు కొద్ది దూరం ఉండగా వధువు, వరుడు కారులో నుంచి దిగి బంధువులతో కలిసి డ్యాన్స్‌ చేశారు. తర్వాత తిరిగి కారులోకి వచ్చారు.

ఆ సమయంలో కారు డ్రైవర్‌ దిగి పక్కన ఉండటంతో పెళ్లి కొడుకు మల్లేశ్‌ డ్రైవర్‌ సీట్లో కూర్చున్నారు. డ్రైవింగ్‌ రాకపోయినా నడిపే ప్రయత్నం చేయడంతో కారు ఒక్కసారిగా ఎదురుగా డ్యాన్స్‌ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. డీజే బాక్సులున్న ట్రాక్టర్‌నూ ఢీకొంది. ఈ ప్రమాదంలో దుబ్బాక సాయిచరణ్‌(13) అనే బాలుడు మృత్యువాత పడ్డారు. పెళ్లి కొడుకు సహా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. పెళ్లికొడుకు మల్లేశ్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై నవీన్‌ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.