అటవీ, పర్యావరణశాఖలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమవేశంలో అటవీ, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాలుష్య నియంత్రణలో కీలకమైన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదం దృష్టి పెట్టాలని సూచించారు. పరిశ్రమలపై హరిత పన్ను ప్రతిపాధనపై సమీక్షించారు. పర్యావరణ పరిరక్షణలో దేశానికి మనరాష్ట్రం మార్గదర్శకంగా ఉండాలని సిఎం ఆకాంక్షించారు. నెలరోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికార్లను ఆదేశించారు.దీనిపై అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని పేర్కొన్నారు. విశాఖలో కాలుష్య నియంత్రణ,గోదావరి జిల్లాల్లో పంటకాల్వల పరిరక్షణపై అధికార్ల తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఇ-వేస్ట్ కోసం కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి ఇంటికీ నాలుగు మెుక్కలు పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికార్లను ఆదేశించారు.
ఇదీచదవండి