జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. బల్దియా పోరులో తెరాస అత్యధిక సీట్లను కైవసం చేసుకుంటుందని ఆరా సంస్థ సీఈవో అండ్ ఎండీ షేక్ మస్తాన్ వెల్లడించారు. తర్వాత స్థానం ఎంఐఎం, మూడో స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉంటుందని అంచనా వేశారు.
ఆరా అంచనాలు ఇలా..
- తెరాస 71-85
- ఎంఐఎం 36-46
- భాజపా 23-33
- కాంగ్రెస్ 0-6
తెరాస, భాజపా మధ్య 9 శాతం ఓట్ల వ్యత్యాసం
- తెరాసకు 40.08 శాతం ఓట్లు
- భాజపాకు 31.21 శాతం ఓట్లు
- ఎంఐఎంకు 13.43 శాతం ఓట్లు
- కాంగ్రెస్‌కు 8.58 శాతం ఓట్లు
- ఇతరులకు 7.70 శాతం ఓట్లు
వరదల తర్వాత 10వేలు రూపాయలు పంచడం తెరాసకు నష్టాన్ని చేకూర్చిందని షేక్ మస్తాన్ పేర్కొన్నారు. గత హామీలు నేరవేర్చలేదని ఓటర్లు చెప్పారని... విద్యార్థులు, యువకులు తెరాసకు దూరమయ్యారని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన వాళ్లు ఓటు బ్యాంకుగా ఉన్నారని స్పష్టం చేశారు. తెలంగాణ వాదంతో ఏకీభవించిన వారు దూరమయ్యారని పేర్కొన్నారు.
జన్‌కీ బాత్ ఎగ్జిట్‌పోల్
గ్రేటర్‌లో తెరాస అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని జన్‌కీ బాత్ ఎగ్జిట్‌పోల్ వెల్లడించింది. తర్వాత స్థానం ఎంఐఎం, మూడో స్థానంలో భాజపా ఉంటుందని పేర్కొంది.
- తెరాస 67-77
- భాజపా 24-42
- ఎంఐఎం 39-43
- ఇతరులు 2-5 డివిజన్లు
ఓట్ల శాతం
- తెరాస-37.4, భాజపా-33.6 ఓట్ల శాతం
- ఎంఐఎం-21, కాంగ్రెస్-4.2 ఓట్ల శాతం
ఇదీ చదవండి