ETV Bharat / city

సచివాలయ పరీక్షలు ప్రారంభం...నిమిషం నిబంధన అమలు! - exams

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాల పరీక్షలు ప్రారంభమయ్యాయి. 6 రోజుల పాటు జరిగే పరీక్షల్లో ఇవాళ కేటగిరీ 1, 3లోని పలు ఉద్యోగాల నియామకానికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలకు అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను లోనికి అనుమతించలేదు.

grama_ward_sachivalayam_exams_started
author img

By

Published : Sep 1, 2019, 4:54 AM IST

Updated : Sep 1, 2019, 10:00 AM IST

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు నియామక పరీక్షలు ప్రారంభమయ్యాయి. లక్షా 26 వేల 728 ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా...అన్ని పరీక్షలకు కలిపి 21 లక్షల 69 వేల 719 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 19 రకాల ఉద్యోగాలకు 14 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల 314 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల కోసం లక్షా 22 వేల 554 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.

నేటి నుంచే సచివాలయ పరీక్షలు...నిమిషం ఆలస్యమైనా అంతే!

అత్యధికంగా విశాఖ నుంచే

10 గంటల నుంచి 12.30 వరకు కేటగిరీ-1లోని 4 రకాల ఉద్యోగాలకు పరీక్ష జరగుతోంది. పంచాయతీ సెక్రటరీ, వార్డు సెక్రటరీ, మహిళా పోలీసు, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ పోస్టులకు అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. కేటగిరి-1 పరీక్షకు 12 లక్షల 54 వేల 34 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా లక్షా 31 వేల 817 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

జిల్లాల వారీగా పోటీ పడుతున్న అభ్యర్థులు

జిల్లా అభ్యర్థుల సంఖ్య
తూర్పు గోదావరి లక్షా 24 వేల 792
కర్నూలు లక్షా 15 వేల 531
కృష్ణా లక్షా 14 వేల 122
గుంటూరు లక్షా 12 వేల 218
చిత్తూరు లక్షా 07 వేల 715
అనంతపురం లక్షా 03 వేల 209
పశ్చిమ గోదావరి 86 వేల 010
కడప 82 వేల 535
ప్రకాశం 75వేల 897
నెల్లూరు 73 వేల 793
శ్రీకాకుళం 70 వేల 588
విజయనగరం 58 వేల 807

నిమిష ఆలస్యమైతే..అంతే..

మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు కేటగిరీ-3లోని డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. రెండు విభాగాల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు కలిపి 15.50 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రాలకు ముందుగా చేరుకున్న అభ్యర్థులకు మాత్రమే లోనికి అనుమతించారు. ఈ మేరకు ఉదయం 9.30 నిమిషాల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇచ్చారు.

నిరంతర పర్యవేక్షణ

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు సహా పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, వీడియో చిత్రీకరణ చేస్తున్నారు. విజయవాడ సమీపంలోని తాడేపల్లిలోని పంచాయతీ రాజ్ శాఖ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతను కంట్రోల్ రూం నుంచి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. అభ్యర్థులు హాల్ టికెట్ తోపాటు ఆధార్ లేదా ఏదేని ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని కమిషనర్ ముందే సూచించారు. పరీక్షల సందర్భంగా ఏదేని సమస్య వస్తే తక్షణం పరిష్కరించేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు.
సమాచారం కోసం అభ్యర్థులు ఫోన్ చేయాల్సిన నెంబర్లు

9191296051
9191296052
9191296053
9191296054
9191296055

ప్రత్యేక బస్సులు

ఒకేరోజు 15 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాస్తోన్న నేపథ్యంలో అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది..అయితే పలుచోట్ల రద్దీతో బస్సులు సరిపోక అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ నెల 3, 4, 6, 7, 8 తేదీల్లో మిగిలిన కేటగిరీల్లోని పరీక్షలకు నియామక పరీక్షలు కొనసాగనున్నాయి.

ఇదీ చదవండి:గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు ఆర్టీసీ సిద్ధం

AP_TPG_102_31_ATTN_TIKKER_R17 ప.గో... గ్రామ వార్డు సభ్యుల రాతపరీక్ష కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప.గో.. నేడు ఉదయం జరిగే పరీక్షకు జిల్లావ్యాప్తంగా 86,015 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ప.గో.. నేడు మధ్యాహ్నం జరిగే పరీక్షకు 19002 అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు ప.గో.. జిల్లా వ్యాప్తంగా 360 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు.. ప.గో.. జిల్లా వ్యాప్తంగా అన్ని పోస్టులు కలిపి 9576 ఖాళీలు ఉన్నాయి. ప.గో.. కలెక్టరేట్, జిల్లా పరిషత్తు లో హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు‌.. కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ 19002331077, జిల్లా పరిషత్ లో 08812_232353, 08812_227415, 08812_231454
Last Updated : Sep 1, 2019, 10:00 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.