ETV Bharat / city

ఆరు దశల్లో కంటి వెలుగు... ఈ నెల 10న సీఎం శ్రీకారం - Govt plan kanti velugu scheme

అక్టోబర్ 10వ తేదీ నుంచి ఆరు దశల్లో కంటి వెలుగు పథకం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కంటి పరీక్షల నిర్వహణకు తగిన ప్రణాళికలు చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, కంటి అద్దాలు అందించేలా చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది.

4 కోట్ల మందికి లబ్ధి చేరుకెలా ఆరు దశల్లో కంటి వెలుగు అమలు
author img

By

Published : Oct 2, 2019, 11:26 PM IST

ఆరు దశల్లో కంటి వెలుగు ... ఈ నెల 10న సీఎం శ్రీకారం
కంటి వెలుగు పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు కోటిన్నర మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయనున్నారు. అందుకుగాను రూ. 250 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 8 లక్షల మందికి క్యాటరాక్ట్, ఇతర శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. కంటి వెలుగు పథకం నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రూ. 560 కోట్లు కేటాయించింది. కంటి వైద్య పరీక్షల నిర్వహణ కోసం ఇంత భారీగా నిధులు కేటాయించడం ఇదే ప్రథమం. అక్టోబర్ 10వ తేదీన అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

ఆరు దశల్లో 2022 వరకు పరీక్షలు
అంధత్వ సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది అక్టోబర్ 2వ గురువారం ప్రపంచ దృష్టి దినోత్సవం జరుపుకుంటారు. ఆ సందర్భంగా 10వ తేదీ నుంచి ఆరు దశల్లో కంటి వెలుగు కార్యక్రమాలు మొదలవనున్నాయి. 2022 జనవరి 31వ తేదీ వరకు కంటి వెలుగు కార్యక్రమాలు జరిగేలా వైద్య ఆరోగ్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. సమగ్ర కంటి పరీక్షలు, కంటి అద్దాలు పంపిణీ, కంటి వైద్య సేవలు అందిస్తారు. శుక్లాలతో బాధపడే వారిని గుర్తించి శస్త్రచికిత్సలు చేయనున్నారు. గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతి, మెల్ల, ఇతర కంటి సమస్యలతో బాధపడే వారిని ఈ పరీక్షల ద్వారా గుర్తించాలని వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు కంటి పరీక్షలు
తొలి రెండు దశల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న 10 లక్షల మంది విద్యార్థులకు... ఉపాధ్యాయులు, ఆశా, ఎ.ఎన్.ఎంల ద్వారా కంటి పరీక్షలను చేయనున్నారు. కంటి పరీక్షల నిర్వహణకు టార్చ్​లైట్, చార్ట్, టేపును ఒక కిట్ రూపంలో రాష్ట్రంలోని ప్రతి పాఠశాలకు పంపిణీ చేయనున్నారు. మూడు నుంచి ఆరు దశల్లో సుమారు 4 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఎల్వీ ప్రసాద్​, శంకర నేత్రాలయ, ఇతర సేవాసంస్థల భాగస్వామ్యంతో ఈ పరీక్షలు నిర్వహించబోతున్నారు.

ప్రముఖ సంస్థలతో పరీక్షల నిర్వహణ
కేంద్ర మార్గదర్శకాలు అనుసరించి శస్త్ర చికిత్సలు చేసిన సంస్థలకు చెల్లింపులు ఉంటాయి. డయాబెటిక్ రెటినోపతీ, చైల్డ్ హుడ్ బ్లైండ్ నెస్, గ్లకోమా కేసులకు 2 వేల రూపాయల వంతున వైద్య ఆరోగ్యశాఖ చెల్లించనుంది. ముందస్తు పరీక్షలతో 80 శాతం అంధత్వ సమస్యలు తగ్గుతాయని ఆంధ్రప్రదేశ్ వైద్య విధానపరిషత్ కమిషనర్ డా. దుర్గాప్రసాద్ తెలిపారు. కంటి అద్దాల కొనుగోళ్లకు టెండరు పిలుస్తామని తెలిపారు. ప్రాథమిక స్థాయిలో కంటి పరీక్షలు ఎలా జరపాలన్న విషయంపై విద్యాసంస్థలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపడతామని కమిషనర్ చెప్పారు.

ఇదీ చదవండి :

అక్టోబర్‌ 10 నుంచి 'వైఎస్సార్‌ కంటివెలుగు'

Intro:Ap_Vsp_93_02_Rly_Gandhi_Memorial_Statue_Inaugration_Ab_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) జాతిపిత మహాత్మాగాంధీ150వ జయంతి సందర్భంగా విశాఖ రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ప్రత్యేక విగ్రహంతో కూడిన చిత్ర,కళా ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

Body:ఈ ప్రదర్శన, విగ్రహాన్ని వాల్తేర్ డిఆర్ఎం చేతన్ కుమార్ శ్రీ వాస్తవ్ ప్రారంభించారు. విగ్రహానికి ఇరువైపులా గాంధీజీ స్వాతంత్ర్య పోరాటం, గాంధీజీ మరణాంతరం జరిగిన పలు కీలక ఘట్టాలను వివరిస్తూ ఛాయాచిత్రాలను ఏర్పాటు చేశారు. విగ్రహం కింద భాగంలో శాంతి ఆశ్రమ నమూనాను ఏర్పాటు చేశారు.

Conclusion:విశాఖ రైల్వేస్టేషన్ లోకి ప్రవేశించగానే అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఈ ప్రాంగణాన్ని రూపుదిద్దారు. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఆయనకు వాల్తేర్ డివిజన్ ఘనమైన నివాళులు అర్పించేందుకు ఇలా ఏర్పాటు చేశామని డిఆర్ఎం తెలిపారు.

బైట్: చేతన్ కుమార్ శ్రీవాస్తవ్, డిఆర్ఎం వాల్తేర్.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.