ETV Bharat / city

రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థలో అక్రమాలపై సీఐడీ దర్యాప్తు

గత ప్రభుత్వ హయాంలో విద్యార్థుల నైపుణ్య శిక్షణిచ్చేందుకు ఏర్పాటు చేసిన సిమెన్స్ ప్రాజెక్టుపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తూ.. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి ఉత్తర్వులిచ్చారు. సీమెన్స్ ప్రాజెక్టులో రూ.241 కోట్ల అక్రమాలు జరిగాయని, దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని సీఐడీ అదనపు డీజీని ఆదేేశించారు.

సీమెన్స్ ప్రాజెక్టుపై సీఐడీ దర్యాప్తు
సీమెన్స్ ప్రాజెక్టుపై సీఐడీ దర్యాప్తు
author img

By

Published : Jul 12, 2021, 3:09 AM IST

రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిధుల మళ్లింపు , నిధుల దుర్వినుయోగం జరిగినట్లు వచ్చిన అభియోగాలపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. సీమెన్స్ ప్రాజెక్టులో రూ.241 కోట్ల అక్రమాలు జరిగాయని, దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని సీఐడీ అదనపు డీజీని ఆదేేశించారు. గత ప్రభుత్వ హయాంలో పాలిటెక్నిక్ విద్యార్థులకు శిక్షణిచ్చేందుకు సీమెన్స్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఈ యంత్రాల మొత్తం ప్రాజెక్టు విలువలో అప్పటి ప్రభుత్వం 10శాతం కింద రూ.370.78 కోట్లు చెల్లించిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుపై ఇటీవల రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించిందని.. షెల్ కంపెనీల ద్వారా రూ.241.78కోట్లు మళ్లించినట్లు ఆడిట్ నివేదినక పేర్కొందని వెల్లడించారు. డిజైన్ టెక్ సీమెన్స్ కంపెనీల ద్వారా నిధులు దారి మళ్లించారని, సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీతో తదుపరి దర్యాప్తునకు నైపుణ్యాభివృద్ధి సంస్థ కోరిందని పేర్కొన్నారు. ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక, నైపుణ్యాభివృద్ధి సంస్థ అభ్యర్థన మేరకు పూర్తి స్థాయి విచారణ కోసం సీఐడీకి అప్పగించాలని సీఐడీ నిర్ణయించిందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: విజయవాడ రైల్వే స్టేషన్‌ యార్డులో భారీ మార్పులు.. తగ్గనున్న రైళ్ల నిరీక్షణ సమయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.