ETV Bharat / city

ఆసుపత్రులు, నర్సింగ్ కళాశాలల్లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - ఏపీ లెటెస్ట్ న్యూస్

రాష్ట్రంలో పలు ప్రభుత్వ ఆసుపత్రులు, నర్సింగ్ కళాశాలల్లో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మూడు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో 282 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది.

ఆసుపత్రులు, నర్సింగ్ కళాశాలల్లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

author img

By

Published : Jul 8, 2020, 6:48 AM IST

రాష్ట్రంలో పలు ప్రభుత్వ వైద్యశాలలు, నర్సింగ్ కళాశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 3 ప్రభుత్వ నర్సింగ్ ఎడ్యుకేషన్ కళాశాలల్లో 282 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేసుకునేందుకు ఆమోదం తెలిపింది. గుంటూరు జీజీహెచ్, శ్రీకాకుళం రిమ్స్, మచిలీపట్నం.. జిల్లా ఆస్పత్రిలో ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. కాకినాడ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 28 టీచింగ్, 59 నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఆమోదం లభించింది.

కర్నూలు ప్రభుత్వ నర్సింగ్ ఎడ్యుకేషన్ కళాశాలలో 29 టీచింగ్, 77 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ కానున్నాయి. అలాగే 3 ప్రభుత్వ నర్సింగ్ పాఠశాలల్లో 144 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఒంగోలు రిమ్స్, తిరుపతి ఎస్​వీఆర్​ఆర్ జీజీహెచ్, ఏలూరు.. జిల్లా హెడ్ క్వాటర్స్ ఆస్పత్రుల్లోని పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో హోదాను బట్టి పదోన్నతులు, రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.

ఇదీ చదవండి : ఇళ్ల పట్టాల పంపిణీని ఎందుకు అడ్డుకుంటున్నారు..?: జోగి రమేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.