Governor at Venkateswara Swamy Temple in Bhubaneswar: భువనేశ్వర్‌లోని వేంకటేశ్వర స్వామిని.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన 'విగ్రహ ప్రతిష్ట' 'మహా సంప్రోక్షణ', 'ఆవాహన' శుభ కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఇతర హిందూ మత పెద్దల సమక్షంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో కల్యాణోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి, తెదేపా చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి :