యోగా సాధనతో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. అందరూ యోగా చేయాలని పిలుపునిచ్చారు. మనదేశంలో 5 వేల సంవత్సరాల క్రితం పుట్టిన యోగా.. శరీరం, మనసుల నడుమ సమన్వయం సాధించడానికి దోహద పడుతుందన్నారు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనలను మిళితం చేస్తుందని పేర్కొన్నారు. 2014లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు.
ఇంట్లోనే ఉండడం ద్వారా మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని కరోనా నుంచి కాపాడుకోవచ్చన్నారు. కామన్ యోగా ప్రొటోకాల్‌ను అనుసరించి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి కుటుంబసభ్యులతో ఇంట్లోనే యోగా దినోత్సవంలో పాల్గొనాలని కోరారు. 'ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి' అని ఆకాంక్షించారు.
ఇవీ చదవండి...