ETV Bharat / city

సీఎం సహాయనిధికి గవర్నర్ రూ.30 లక్షల విరాళం

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా..గవర్నర్ బిష్వ భూషణ్ మరో అడుగు ముందుకేశారు. రాష్ట్ర ప్రథమ పౌరునిగా తన విచక్షణాధికారాలను ఉపయోగించి... 30లక్షల రూపాయలను సీఎం సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. ఇప్పటికే సంవత్సరం పాటు తన జీతంలోని ముప్పై శాతం కోతకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

author img

By

Published : Apr 11, 2020, 5:53 AM IST

విచక్షణాధికారం ఉపయోగించి..సీఎం సహాయ నిధికి రూ.30లక్షలు

కరోనా వైరస్ నివారణ చర్యలకు సహకరించే క్రమంలో గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ వినూత్నంగా ఆలోచించారు. ప్రధాని పిలుపు మేరకు తన జీతంలో సంవత్సరం పాటు ముప్ఫై శాతం కోతకు ఇప్పటికే ముందుకు రాగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రథమ పౌరునిగా తనకున్న విచక్షణ అధికారాలతో రూ.30 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా సమకూర్చారు.

రాజ్ భవన్ బడ్జెట్ కు సంబంధించి నిధుల వినియోగంలో గవర్నర్​కు విశేష విచక్షణ అధికారాలు ఉంటాయి. కొవిడ్-19 వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలను చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలకు ఆర్థికపరమైన వెసులుబాటు కోసం... రాష్ట్ర రాజ్యాంగ అధినేత ఈ చర్యకు ఉపక్రమించారు. ముప్ఫై లక్షల రూపాయలను ముఖ్య మంత్రి సహాయ నిధికి సమకూర్చారు . రాష్ట్ర గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాల రాజ్​భవన్​లకు సైతం ఆదర్శంగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్వయంగా తన ఖర్చులను తగ్గించుకుని ముఖ్యమంత్రి సహాయనిధికి నిధులు సమకూర్చడం స్ఫూర్తినిస్తుందని చెబుతున్నారు.

ఇవీ చూడండి-కరోనాపై పోరులో.. కీలకంగా 'మెడ్​టెక్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.