సంక్రాంతి వేడుకలు ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగులు తెలుగునాట ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయని అన్నారు. సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి వేళ తెలుగు లోగిళ్లు అలనాటి అనుభూతులకు వేదికలుగా మారాలని గవర్నర్ ఆకాంక్షించారు.
సంక్రాంతి వేళ.. ప్రత్యేకించి గ్రామ సీమల్లో నెలకొనే సందడి అనిర్వచనీయమన్నారు. ధాన్యసిరులు, సిరి సంపదలతో రైతులు జరుపుకునే సంక్రాంతి వేడుక తెలుగు వారి సంప్రదాయాలలో ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించిందని చెప్పారు. ఈ శుభ సందర్భం మనందరిలో ప్రేమ, ఆప్యాయత, స్నేహం, సోదరభావం ఆవశ్యకతను, ఆలోచనలను ప్రేరేపిస్తుందని గవర్నర్ తెలిపారు.
ఇదీ చదవండి: