ETV Bharat / city

తెలంగాణ: ఆయిల్‌పామ్‌ సాగుపై సర్కారు దృష్టి.. సాగు పెంచేందుకు ప్రయత్నాలు

author img

By

Published : Jan 9, 2021, 9:05 AM IST

సిరుల పంటగా భావించి ఆయిల్ పామ్ సాగుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. రెండున్నరేళ్లుగా కసరత్తు చేస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ ఆయిల్ పామ్‌ సాగుకు అనుకూల పరిస్థితులున్నాయని గతంలో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ప్రయోగాత్మకంగా కామారెడ్డి జిల్లా బొప్పాస్‌పల్లి విత్తనోత్పత్తి క్షేత్రంలో పంట సాగును చేపట్టగా... ప్రస్తుతం సత్ఫలితాలు కనబడుతున్నాయి.

oil farm
ఆయిల్‌పామ్‌ సాగుపై సర్కారు దృష్టి
ఆయిల్‌పామ్‌ సాగుపై తెలంగాణ సర్కారు దృష్టి

దేశంలో నూనె గింజల ఉత్పత్తి తక్కువగా ఉండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందటే ఈ పంటపై దృష్టి సారించింది. కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే ఈ పంట ప్రయోగాత్మకంగా సాగు చేసి విజయం దిశగా నడుస్తున్నారు. నస్రుల్లాబాద్ మండలం బొప్పాస్‌పల్లి విత్తనోత్పత్తి క్షేత్రంలో పంట సాగవుతోంది. అప్పటి వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఆయిల్ పామ్‌ సాగు చేయించారు.

ఉద్యాన, ఆయిల్ ఫెడ్ శాఖ ఆధ్వర్యంలో విత్తనోత్పత్తి క్షేత్రంలో ఉన్న 500 ఎకరాల స్థలంలో సర్వే చేయించి.... చెరువుకింద ఉన్న 2 ఎకరాల్లో పంట వేశారు. ఎకరానికి 66 మొక్కొల చొప్పున 132 మొక్కలు నాటారు. రెండున్నరేళ్ల వయసుకు వచ్చిన చెట్లు పది అడుగుల ఎత్తు పెరిగాయి. మొదటి ఏడాది నుంచే పూత, కాత వచ్చినా నిపుణుల సూచన మేరకు దిగుబడి తీయకుండా తొలగించారు. ఈ మధ్య కాలంలో ఆయిల్ ఫెడ్ అధికారులు పంటను పరిశీలించి బాగుందని ప్రభుత్వానికి నివేదించారు.

40ఏళ్ల వరకు లాభాలు

ఆయిల్‌పామ్‌ సాగులో లాభాలు అధికంగా పొందే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఆ పంటపై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే 19వేలకుపైగా ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగుచేయాలని ఆదేశించిన ప్రభుత్వం...రాయితీలను సైతం ప్రకటించింది. ఎక్కువ విస్తీర్ణంలో భూములున్న రైతులు ఆయిల్‌పామ్‌ సాగుపై దృష్టి పెట్టాలని అధికారులు సూచిస్తున్నారు. మొదటి సంవత్సరం మాత్రమే ఎక్కువ ఖర్చు ఉంటుందని...ఆ తర్వాత 30 నుంచి 40ఏళ్ల వరకూ లాభాలు పొందవచ్చని అధికారులు చెబుతున్నారు.

అవగాహనా కార్యక్రమాలు

కొత్త పంట కావడంతో ఆయిల్‌పామ్‌ సాగుపై రైతులకు మరింత అవగాహన కల్పిస్తే రైతులు ముందుకొస్తారని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం జిల్లాకో ఏజెన్సీని నియమిస్తోంది. నిజామాబాద్‌ జిల్లాలో 45వేల ఎకరాల్లో, కామారెడ్డి జిల్లాలోనూ 60వేల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉందని గతంలో సర్వేలు తెలిపాయి. ఈ నేపథ్యంలో రైతులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించే అవకాశముంది.

బిందు సేద్యానికి నిధులు!

ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ పంట సాగుకు సబ్సిడీ ఇస్తున్నా.. బిందు సేద్యానికి నిధులు ఇవ్వడం లేదు. దీనివల్ల పెట్టుబడి పెరుగుతోంది. ఆ విషయంపై దృష్టి సారిస్తే రైతులు ముందుకొచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చూడండి:

4 దశల్లో పంచాయతీ ఎన్నికలు..షెడ్యూల్‌ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.