ETV Bharat / city

Ports: ఓడరేవుల నిర్మాణ రుణాలకు ప్రభుత్వ పూచీ: మంత్రివర్గ భేటీలో నిర్ణయం - ఏపీ లేటెస్ట్​ అప్​డేట్​

Cabinet decision: ఓడరేవుల నిర్మాణ రుణాల కోసం బ్యాంకులకు ప్రభుత్వం పూచీ ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. బెంగళూరు-కడప, కడప-విశాఖ మధ్య 3 విమాన సర్వీసులు నడిపేందుకు ఆమోదం తెలిపింది. మరోవైపు తితిదే ప్రత్యేక ఆహ్వానితుల బిల్లును ఆమోదించింది. సోమవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణాయాలు తీసుకుంది.

AP Cabinet Meeting
మేకపాటి మృతిపై మౌనం పాటిస్తున్న మంత్రి వర్గం
author img

By

Published : Mar 8, 2022, 8:54 AM IST

రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం ఓడరేవుల నిర్మాణానికి రూ.8,741 కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వ పూచీ ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రూ.1,234 కోట్లతో నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులిచ్చేందుకు అంగీకరించింది. సోమవారం శాసనసభ వాయిదాపడ్డ తర్వాత.. సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉర్దూను రెండో భాషగా ఎంపిక చేసుకున్నవారు చదువుకునేందుకు వీలు కల్పించే చట్ట సవరణను మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుత సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న తితిదే ప్రత్యేక ఆహ్వానితుల బిల్లు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో గోదాముల నిర్మాణానికి స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు బిల్లు, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ శాసనసభలో ప్రవేశపెట్టనున్న బిల్లులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

కేబినెట్​ నిర్ణయాలు...

  • బెంగళూరు-కడప, విశాఖపట్నం-కడప మధ్య వారానికి 3 విమాన సర్వీసులు నడిపే ప్రతిపాదనకు ఆమోదం. కడప నుంచి ఇప్పుడు నడుస్తున్న సర్వీసులకు ఇవి అదనం. ఇండిగో విమానయాన సంస్థతో ఏపీఏడీసీఎల్‌ ఒప్పందం చేసుకునేందుకు కేబినెట్‌ పచ్చజెండా. ఏడాదికి రూ.15 కోట్ల మేర మద్దతివ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం.
  • అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాజెక్టు-2 కింద చెరువులకు నీళ్లిచ్చేందుకు రూ.214.85 కోట్లతో బైపాస్‌ కాలువ నిర్మాణం.
  • ఉప్పుటేరుపై పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం మోళ్లపర్రు వద్ద రెగ్యులేటర్‌-బ్రిడ్జి లాకుల నిర్మాణానికి, కృష్ణా జిల్లా సరిహద్దులోని పడితడిక గ్రామం వద్ద 1.4 కిలోమీటర్ల మేర రెగ్యులేటర్‌- బ్రిడ్జి నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులు.
  • మొబైల్‌ ఆంబ్యులేటరీ వెటర్నరీ క్లినిక్‌ ప్రాజెక్టులో భాగంగా రెండో దశలో 165 మొబైల్‌ వెటర్నరీ క్లినిక్‌ల కొనుగోలు. వీటి నిర్వహణకు రూ.75.24 కోట్లు మంజూరు.
  • నెల్లూరు జిల్లా చింతలదేవి వద్ద జాతీయ కామధేను బ్రీడింగ్‌ సెంటర్‌ (ఎన్‌కేబీసీ) ఏర్పాటు.
  • విజయవాడకు చెందిన ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖను డిప్యూటీ కలెక్టర్‌గా నియమించే ప్రతిపాదనకు ఆమోదం.
  • కర్నూలుకు చెందిన ఇండియన్‌ డెఫ్‌ టెన్నిస్‌ టీం కెప్టెన్‌, 2017 డెఫ్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత షేక్‌ జాఫ్రిన్‌కు ప్రభుత్వ ఉద్యోగం.
  • తూనికలు, కొలతలశాఖలో డిప్యూటీ కంట్రోలర్‌ పోస్టును జాయింట్‌ కంట్రోలర్‌ (అడ్మిన్‌) పోస్టుకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.
  • కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డిగ్రీ కళాశాలలో 24 బోధన, 10 బోధనేతర పోస్టుల భర్తీకి ఆమోదం.
  • ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ ఫోర్స్‌లో 17 ఆఫీసర్‌ స్థాయి (7 ఏఏస్పీ, 10 డీఎస్పీ) పోస్టులకు ఏర్పాటుకు ఆమోదం.
  • స్టేట్‌ వక్ఫ్‌ ట్రైబ్యునల్‌లో 8 రెగ్యులర్‌, 4 అవుట్‌సోర్సింగ్‌ పోస్టులకు ఆమోదం.

గౌతమ్‌రెడ్డి మృతికి నివాళి

మంత్రి గౌతమ్‌రెడ్డి మృతికి మంత్రిమండలి నివాళులర్పించింది. ముఖ్యమంత్రి, మంత్రులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.

ఇదీ చదవండి: గవర్నర్‌.. గో బ్యాక్‌ నినాదాలతో హోరెత్తిన అసెంబ్లీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.