ETV Bharat / city

YSR Vahana Mitra: ఆ శాఖ నిధులు మళ్లించలేదు - వైఎస్ఆర్ వాహన మిత్ర పథకంపై హైకోర్టు

దేవాదాయ శాఖకు చెందిన నిధుల్ని వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి మళ్లించ లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్​కు ప్రభుత్వం బడ్జెట్ ద్వారా కేటాయించిన నిధులను కేవలం బ్రాహ్మణుల వాహన మిత్ర పథకానికి వినియోగిస్తున్నట్లు కౌంటర్లో ప్రభుత్వం పేర్కొంది.

vahana mitra
నిధులు మళ్లించలేదు
author img

By

Published : Jul 6, 2021, 5:55 AM IST

దేవాదాయ శాఖకు చెందిన నిధుల్ని వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి మళ్లించ లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వం వేసిన కౌంటర్‌ను పరిశీలించానని, అందులోని వివరాలతో సంతృప్తి చెందానన్నారు. దేవాదాయ శాఖ నిధులను మళ్లించడం లేదని, బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్​కు ప్రభుత్వం బడ్జెట్ ద్వారా కేటాయించిన నిధులను కేవలం బ్రాహ్మణుల వాహన మిత్ర పథకానికి వినియోగిస్తున్నట్లు కౌంటర్లో పేర్కొన్నారన్నారు.

ఈ నేపథ్యంలో వ్యాజ్యంపై విచారణ అవసరం లేదన్నారు. ఆ వివరాల్ని నమోదు చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం పిల్​పై విచారణను మూసివేసింది. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి దేవాదాయ శాఖ నిధులు రూ .49లక్షలు మళ్లింపు నిమిత్తం 2021 జూన్ 15 న దేవాదాయ రెవెన్యూ శాఖ జీవో 334 జారీచేసిందని, ఆ జీవోను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని తిరుపతికి చెందిన సామాజిక కార్యకర్త, భాజపా నేత జి.భానుప్రకాశ్ రెడ్డి హైకోర్టులో పిల్ వేశారు.

ఇదీ చదవండి:

Corona Special Leaves: కరోనా బాధిత ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.