FREE ACCOMMODATION: హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వచ్చిన ఉద్యోగులకు ఉచిత వసతిని రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఉచిత వసతి గడువు రేపటితో ముగుస్తుండటంతో రేపటిలోపు ప్రతి ఉద్యోగి ఉచిత వసతిని ఖాళీ చేయాలని ఈ ఉదయం సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. కొన్ని గంటల్లోనే ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు ఉచిత వసతిని ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది. సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్, అసెంబ్లీ, హెచ్‌వోడీల ఉద్యోగులకు ఉచిత వసతి పొడిగించారు.
ఐదురోజుల పని దినాలపై నో క్లారిటీ : సచివాలయం, హెచ్ఓడీ ఉద్యోగులకు కొనసాగుతున్న వారానికి ఐదు రోజుల పనిదినాల విధానం.. ఈ నెల 27 తేదీతో ముగిసింది. మరి, ఇకమీదట ఎలాంటి విధానం కొనసాగనుంది అనే విషయంలో క్లారిటీ లేదు. గడువు ముగిసి రెండు రోజులైనా.. ఇప్పటి వరకూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో.. ఐదు రోజుల పనిదినాల విధానం కొనసాగుతుందా? లేదా? అనే ఉత్కంఠ ఉద్యోగుల్లో నెలకొంది.
జూలై రెండో తేదీ శనివారం అవుతోంది. ఐదు రోజుల విధానం కొనసాగితే.. ఆ రోజు ఉద్యోగులకు సెలవు లభిస్తుంది. కానీ.. ఇప్పటి వరకూ సర్కారు స్పష్టత ఇవ్వకపోవడంతో.. ఆ రోజున విధులకు రావాలా? లేదా? అనే సందిగ్ధంలో ఉన్నారు సచివాలయం, హెచ్ఓడీ ఉద్యోగులు. మరో రెండు రోజులే గడువు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి.
ఇవీ చదవండి: