ETV Bharat / city

ఆరోగ్యశాఖలో సిబ్బంది నియామకాలకు రంగం సిద్ధం!

రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల మందికి పైగా ఆరోగ్య శాఖలో సిబ్బందిని నూతనంగా నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఒకవైపు మెడికల్ కాలేజీలు, మరోవైపు అందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు సంస్కరణలు చేపడుతుందని అధికారులు తెలిపారు. నూతనంగా చేరే వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయరాదని ప్రభుత్వం నిబంధన విధించనుంది.

Government approves to appoint medical staff
వైద్య సిబ్బంది నియామకానికి ప్రభుత్వం ఆమోదం
author img

By

Published : Jun 3, 2020, 7:18 AM IST

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 9వేల మందికి పైగా ఆరోగ్య శాఖ సిబ్బందిని నియమించేందుకు రంగం సిద్దం చేస్తుంది. విడతల వారీగా రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలను నిర్మించనున్నారు. వీటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు నిర్మిస్తామని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. 2,112 వైద్యులు జనరల్ మెడిసిన్ పోస్టులకు నియామకాలు జరగనున్నాయి. మంజూరైన పోస్టుల్లో శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేపట్టనున్నారు.

నూతనంగా ఉద్యోగాల్లో చేరే వైద్యులకు అదనంగా మరో ఏడాది ప్రొబేషనరీ పిరియడ్ ఉండే విధంగా ఆలోచిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వైద్యులతో పాటు ల్యాబ్ టెక్నీషియన్స్ ,ఫార్మసిస్టుల నియామకాలు సైతం చేపట్టనున్నారు. వీరిని వైద్య విధాన పరిషత్, వైద్య విద్య సంచాలకుల పరిధిలో నియమించనున్నారు. తమిళనాడులో ఉన్న మాదిరిగానే ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి నియమించాలని తొలుత ప్రభుత్వం భావించింది. అయితే ప్రస్తుత విధానం ద్వారానే వైద్యుల భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు.

నూతనంగా వచ్చే వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదని అధికారులు చెబుతున్నారు. వీరికి నాన్ ప్రాక్టీస్ భత్యం అదనంగా 15 శాతం మూలవేతనంలో ఇస్తారని తెలిపారు. భర్తీ ద్వారా పీహెచ్​సీ, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లోనే నాణ్యమైన వైద్యం ప్రజలకు అందించవచ్చని తెలిపారు. వీటిల్లో వైద్యులు 24 గంటలూ ఉండేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైన ఔషదాలను పీహెచ్​సీ కేంద్రాల్లోనే అందుబాటులో ఉంచుతామని తెలిపారు. అదేవిధంగా టెలీమెడిసిన్ విధానం ద్వారా వైద్య సేవలను విస్తృతం చేస్తామని ఆరోగ్యశాఖ అధికారులు చెుుతున్నారు.

ఇదీ చదవండి:

ఈ తల్లి 14 ఏళ్లుగా కొడుకును మోస్తూనే ఉంది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.