భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జన్మదినాన్ని.. రాజ్ భవన్లో గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఘనంగా నిర్వహించారు. కులం, మతం ప్రాతిపదికన తేడాలు లేని ఆధునిక భారతదేశం కోసం నిరంతర పోరాటం చేశారని గవర్నర్ కొనియాడారు. మహిళలకు, సమాజంలోని అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు జీవితాన్నే అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అని కీర్తించారు. అంబేడ్కర్ ఆధునిక భారతదేశ నిర్మాణానికి, దళితులపై సామాజిక వివక్షను అరికట్టడానికి చేసిన కృషి మరువలేనిదని గవర్నర్ స్మరించుకున్నారు.
ఇదీ చదవండి: జాతి గౌరవ పతాక.. అంబేడ్కర్