ఉపాధ్యాయులు సమాజ వాస్తుశిల్పులని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొనియాడారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దేశ రెండో రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకుని ఆయన గౌరవార్థం ఏటా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం అభినందనీయమని రాజ్‌భవన్ నుంచి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. డాక్టర్ రాధాకృష్ణన్ ఒక ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడు, పండితుడు, తత్వవేత్త, రచయిత, రాజకీయ నాయకునిగా సేవలు అందించారని, తన జీవితాంతం ఉన్నత నైతిక విలువలకు నిలబడ్డారన్నారు. అదేమార్గంలో ఉపాధ్యాయ సమాజం పయనించాలని గవర్నర్ ఆకాంక్షించారు. దేశ నిర్మాణంలో ఉపాధ్యాయులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని, వారి సహకారం లేకుండా ఏ సమాజం ప్రగతిశీల మార్గంలో అభివృద్ధి చెందబోదని గవర్నర్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి :