ETV Bharat / city

CJI: తెలుగు రాష్ట్రాల పర్యటనలో భావోద్వేగానికి గురయ్యా: జస్టిస్ ఎన్‌వీ రమణ

తెలుగు రాష్ట్రాల పర్యటనలో భావోద్వేగానికి గురయ్యానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ పేర్కొన్నారు. ఆదరాభిమానాలు చూపిన ప్రజలకు శతకోటి వందనాలు తెలిపారు.

cji nv ramana
cji nv ramana
author img

By

Published : Jun 20, 2021, 9:25 PM IST

తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల పర్యటన ఎంతో సంతృప్తినిచ్చిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ వెల్లడించారు. తెలుగు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఆదరాభిమానాలు చూపిన ప్రజలకు శతకోటి వందనాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల పర్యటనలో భావోద్వేగానికి గురయ్యానన్నారు. తెలుగు ప్రజల దీవెనలతో సీజేఐ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తానని స్పష్టం చేశారు.

తెలంగాణ గవర్నర్‌, సీఎం, హైకోర్టు సీజే, న్యాయమూర్తులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, సకల పక్షాల నాయకులు, అధికారులకు జస్టిస్​ ఎన్​వీ రమణ ధన్యవాదాలు తెలిపారు. రాజ్‌భవన్‌, హైకోర్టు, పోలీసు సిబ్బంది, పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలిపారు. కంటికి రెప్పలా చూసుకున్న తెలంగాణ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

యాదాద్రి, తిరుమల, శ్రీశైలం పాలకమండళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. యాదాద్రి అభివృద్ధికి ప్రభుత్వ కృషి ప్రశంసనీయమని జస్టిస్‌ ఎన్‌వీ రమణ కొనియాడారు. కొవిడ్‌ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండని సీజేఐ సూచించారు. ముప్పు తొలగిందని శాస్త్రవేత్తలు నిర్ధారించే వరకు జాగ్రత్తగా ఉండాలన్నారు.

ఇవీచూడండి:

RRR LETTER: అమరావతిపై సరైన దృక్పథంతో ఆలోచించండి.. సీఎం సార్: రఘురామ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.