వైకాపా ప్రభుత్వంపై తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో రూ. 2 లక్షలు దొరికితే రూ. 2వేల కోట్లు లభించాయని అబద్ధపు ప్రచారాలు చేశారని దుయ్యబట్టారు. సొంత మీడియా ద్వారా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ను నమ్మి ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకురాకపోగా.. దిల్లీ వెళ్లి కేంద్రపెద్దల కాళ్లు పట్టుకుని కేసుల మాఫీ గురించి అడుగుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరి, అధికారంలోకి వచ్చాక ఎందుకు వద్దంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలు ఉన్న జగన్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందని ఎద్దేవాచేశారు.
ఇవీ చదవండి.. రూ.2లక్షలను రూ.2వేల కోట్లని ప్రచారం చేస్తారా..?