గ్రామ సచివాలయాల ఉద్యోగాలకు పెద్దఎత్తున స్పందన లభిస్తోందని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది తెలిపారు. ఇప్పటివరకూ 6 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. 20 లక్షలమంది వరకు దరఖాస్తు చేయవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేవారి మాయ మాటలు నమ్మవద్దని అభ్యర్థులకు సూచించారు. ఎక్కడా ఎలాంటి అక్రమాలకు అవకాశం ఉండదని...పూర్తి పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ద్వివేది అన్నారు.
ఈ నెల 31 ఉదయం, సెప్టెంబర్ 1 న రెండుపూటలా పరీక్షలు నిర్వహిస్తామని... పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకటికంటే ఎక్కువ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఒకే పరీక్ష కేంద్రంలో అవకాశం ఉంటుందని ద్వివేది స్పష్టం చేశారు.
ఇవీ చూడండి-ఎన్ఎమ్సీ బిల్లును నిరసిస్తూ వైద్యుల నిరసన