రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. డీఏ పెంపు ఉత్తర్వులను ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణ విడుదల చేశారు. జులై 2018 నుంచి పెంచిన 3.144 శాతం కరవు భత్యం మంజూరు చేశారు. 27.248 నుంచి 30.392 డీఏ శాతానికి పెరిగింది. 2021 జనవరి నెలకు సంబంధించిన జీతాలతో(ఫిబ్రవరి) కలిపి నగదుగా చెల్లింపులు చేయనున్నారు. 1 జులై 2018 నుంచి 31 డిసెంబర్ 2020 వరకు 30 నెలల బకాయిలను.. జీపీఎఫ్, జెడ్పీపీఎఫ్ వారికీ 3 సమ భాగాల్లో పీఎఫ్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. సీపీఎస్ వారికీ 30 నెలల ఎరియర్స్ 90 శాతం నగదు, 10శాతం అకౌంట్‌కు, 3 సమ భాగాల్లో జమ కానుంది. 2019 జనవరి డీఏ 2021 జులై నుంచి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2019 జులై డీఏ 2022 జనవరి నుంచి చెల్లించేలా ఆదేశాలు వెలువడ్డాయి.
ఇదీ చదవండీ... 'రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యాలు'