ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే ప్రార్ధనలు - విజయనగరం జిల్లాలో గుడ్ ఫ్రైడే సంబరాలు

రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ సోదరులు.. గుడ్ ఫ్రైడేను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పలు ప్రాంతాల్లో క్రీస్తుకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ర్యాలీలు చేపట్టారు.

Good Friday
గుడ్ ఫ్రైడే వేడుకలు
author img

By

Published : Apr 2, 2021, 9:24 PM IST

రాష్ట్రంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ప్రాంతాల్లో క్రైస్తవ సోదరులు.. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రీస్తు యాత్రలను నిర్వహించారు.

విశాఖ జిల్లాలో..

నర్సీపట్నంలో, పలు ప్రాంతాల్లోని క్రైస్తవ మందిరాల్లో గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీబీఎన్ కాంపౌండ్ వద్ద ఉన్న పురాతన చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ర్యాలీలు చేపట్టారు. పెద్ద బొడ్డేపల్లిలోని ఆర్సీఎం చర్చి ప్రాంగణంలో క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

రావికమతం మండలం కొత్తకోటలోని చర్చి ఆధ్వర్యంలో క్రైస్తవ సోదరులు యేసు క్రీస్తు శిలువ మోత విధానంపై ప్రత్యేక ప్రదర్శన నిర్వహించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. రోలుగుంట, మాకవరపాలెం, నాతవరం, గొలుగొండ తదితర మండలాల్లో గుడ్ ఫ్రైడే వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.

పశ్చిమగోదావరి జిల్లాలో..

తణుకులో క్రీస్తు విశ్వాసకులు యాత్ర నిర్వహించారు. క్రీస్తు శిలువ బొమ్మలు చేత ధరించి యాత్రలో పాల్గొన్నారు. యాత్ర చివరి భాగంలో శిలువ వేసిన యేసు ప్రభువు విగ్రహాన్ని వాహనంపై ఊరేగించారు. ఈ వేడుక పలువురిని ఆకట్టుకుంది.

విజయనగరం జిల్లాలో..

కురుపాం నియోజకవర్గంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. నిరంతరాయంగా ప్రత్యేక ప్రార్థనలు కొనసాగాయి. క్రీస్తును స్తుతిస్తూ ఆలపించిన భక్తిగీతాలు అలరించాయి. ప్రార్థనల అనంతరం భక్తులకు గురువులు, దీవెనలు అందించారు.

నెల్లూరు జిల్లాలో..

నెల్లూరు, కావలి, సూళ్లూరుపేట పట్టణాలు, గ్రామాలలో గుడ్ ఫ్రైడేను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. చర్చిలో ప్రార్థన మందిరాల్లో పాస్టర్లు శుభ శుక్రవారం ఆరాధనలు జరిపారు.

కృష్ణా జిల్లాలో...

గుడ్​ఫ్రైడే సందర్భంగా మైలవరం నియోజకవర్గవ్యాప్తంగా పలు గ్రామాల్లో శిలువను ఊరేగించారు. క్రైస్తవ గీతాలు ఆలపిస్తూ, క్రీస్తును స్మరించుకుంటూ, మైలవరం పట్టణంలో ఊరేగింపు చేపట్టారు.

గన్నవరం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో ప్రసిద్ధ కేథలిక్ పుణ్యక్షేత్రం, ఉంగుటూరు మండలం పెద్దఅవుటుపల్లి బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రం, ముస్తాబాద దివ్యకారుణ్య క్షేత్రం, తేలప్రోలు, గన్నవరం, కేసరపల్లి, అజ్జంపూడి ఇతర కేథలిక్ చర్చిల్లో పవిత్ర శుక్రవారాన్ని ఘనంగా నిర్వహించారు.

కర్నూలు జిల్లాలో...

గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని కర్నూలులో భక్తి శ్రద్థలతో జరుపుకున్నారు. నగరంలోని చర్చీల్లో ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆర్​సీఎం చర్చ్ ఆధ్వర్యంలో శిలువను మొస్తూ నగరంలో ప్రదర్శన నిర్వహించారు.

కడప జిల్లాలో...

పులివెందులలో గుడ్​ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శత్రువునైనా ప్రేమించాలని క్రీస్తు సందేశం చెబుతోందని ఫాస్టర్లు పేర్కొన్నారు. అనంతరం పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఏసు క్రీస్తు కరుణామయుడని, ఆయన పాటించిన సహనం, ప్రేమ, దయ, శాంతి, త్యాగం వంటి విలువలు యావత్ ప్రపంచ మానవాలి అనుసర‌ణీయమని అన్నారు.

ఇదీ చదవండీ.. ఎస్​ఈసీ నిర్వహించే అఖిలపక్ష సమావేశం బహిష్కరించిన భాజపా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.