తెలంగాణ నేత, ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాష్ రావు (Gone Prakash Rao) సీఎం జగన్ (cm jagan) పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ బెయిల్ రద్దయ్యి జైలుకు పోవడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. వాస్తవాలు చెబుతుంటే వైకాపా నేతలు, పార్టీ శ్రేణులు తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇలానే బెదిరింపులకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. జగన్ అసలు స్వరూపాన్ని బయటపెడతానన్నారు. తెలంగాణాలోనే కాదు ఏపీలోనూ మీడియా సమావేశాలు నిర్వహించి జగన్ స్వరూపాన్ని బయట పెట్టే ధైర్యం ఉందన్నారు.
వైఎస్సార్ పాదయాత్రలో జగన్ ఏ రోజు పాల్గొనలేదని.. వైఎస్ విజయమ్మ తన పుస్తకంలో అవాస్తవాలు రాశారన్నారు. వైకాపా గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మ.. ఖమ్మంలో ఏర్పాటు చేసిన షర్మిల సభలో ఏ విధంగా పాల్గొన్నారని నిలదీశారు. ఆమెకు జగన్.. ఎందుకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం లేదన్నారు. వివేకా హత్య(viveka murder)ను.. ఆ పార్టీలోని కొందరు నేతలు గుండెపోటుగా చూపించే ప్రయత్నం ఎందుకు చేశారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ (CBI) విచారణ అడిగిన జగన్.. ఇప్పుడు ఎందుకు స్పందించటంలేదని ఆక్షేపించారు.
ఇదీ చదవండి